English, asked by siddhuchowdary456, 3 months ago

a letter to a friend about school in telugu​

Answers

Answered by ItzBabygirl26
1

Answer:

తేదీ: 21/05/2021

చిరునామా,

మాధవి,

డోర్ నెంబర్ 22,

బృందావన్ అపార్ట్మెంట్స్,

జూబ్లీహిల్స్ ,

హైదరాబాద్.

ప్రియమైన స్నేహితురాలికి,

నీ స్నేహితురాలు రాయునది ఏమనగా నేను ఇక్కడ చాలా బాగున్నాను. నువ్వు అక్కడే ఎలా ఉన్నావు. ఇంట్లో వాళ్లు అందరూ ఎలా ఉన్నారు. నువ్వు ఎలా చదువుతున్నావు. ఇక్కడ నేను బానే ఉన్నాను పోయిన నెల మా స్కూల్లో వార్షిక దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకలు మా స్కూల్లో మేమందరం కలిసి చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఈ వేడుకలలో మేము చాలా రకాలైన స్కిట్లు చేశాము. అలాగే మా స్నేహితులతో కలిసి కొన్ని మంచి పాటలకి డాన్స్ కూడా చేసాము.

ఆరోజు మా స్కూలు ప్రిన్సిపాల్ గారు స్కూలు గురించి మరియు పిల్లల గురించి చాలా చక్కగా మాట్లాడారు అవన్నీ వింటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ వార్షిక దినోత్సవం రోజున మా స్కూల్లో మేమంతా కలిసి ఉపాధ్యాయుల కొన్ని చిన్న చిన్న ఆటలు నిర్వహించాము. ఇందులో గెలిచిన వారికి చిన్న చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాము దీనికి ఉపాధ్యాయులందరూ చాలా సంతోషించి మళ్లీ మెచ్చుకున్నారు.

ఇలా ఆ రోజంతా మేము ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా గడిపాను. ఉత్తరం అందిన వెంటనే నీవు కూడా నాకు ఉత్తరం రాస్తావ్ అని ఆశిస్తున్నాను.

ఇట్లు,

నీ ప్రియమైన

అపర్ణ

Similar questions