World Languages, asked by dheeraj1324, 11 months ago

a short note on Golconda in Telugu

Answers

Answered by maazshaikh1786
25

గోల్కొండ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం గోల్కొండ (అయోమయ నివృత్తి) చూడండి.

గోల్కొండ కోట మరియు నగరము. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. 1336 A. D.లో [[ముసునూరి నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D. లో ముసునూరి కాపయ భూపతి గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.

"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే [[కాకతీయులు కు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయ కమ్మరాజులకు, వారి వారసులు [[ముసునూరి నాయకుల కు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి కమ్మరాజుల విప్లవముతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో గుల్బర్గ్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి పెక్కు సంఘర్షణలు జరిగాయి[1]. మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపయ భూపతి కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవ్ ని పంపాడు. కాని వినాయక దేవ్ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు. 1361లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా వేలం పట్టణముపై దాడి చేసి వినాయక దేవ్ ని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడు[2]. గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రముగా గాయపడ్డాడు. ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపయ భూపతిపై యుద్ధమునకు తలపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపయ భూపతి ఢిల్లీ సుల్తాను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరించాడు. బలహీనపడిన కాపయ భూపతి షాతో సంధిచేసుకున్నాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత నవాబులు పాలించారు.


1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్తులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రాసుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టుకుని జీవించేవారు.[3] ఐతే రాజధాని తరలిపోయివుండడంతో అక్కడ రాజ్యతంత్రానికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కాదు.


Answered by Sidyandex
8

Golconda belongs to Telangana district and it is one of the grandest forts of India.

The Golconda fort is almost 400 years old.

If anyone looking forward to seeing the elegance of the Nawabi culture, then by visiting the Golconda fort, they can see and feel it.

Tourist will get mesmerized by having a tour around the places in Golconda. The sheer magnitude available in that for will completely blow everyone.

Similar questions