India Languages, asked by nadvindoddibaswaraj, 7 months ago

A total Christmas story speech in telugu​

Answers

Answered by avikajain22
1

Speech :

ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని, ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ, దయామయుడుగానూ క్రెస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడు. 2 వేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు డిసెంబరు 25 తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు.. అంతే కాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు’ అని తెలియజేసింది. ఏసు అంటే రక్షకుడు అని అర్థం.

దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి ‘మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు’ అని పలికింది. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. ఇక, రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమైన బెత్లేహామ్‌కు బయలుదేరారు. అయితే, వారు అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే ఏసుకు మేరీ జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగి వచ్చాడు.

ఆ దూత చుట్టూ వెలుగులు ప్రసరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు. ‘మీరు భయపడకండి, ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడకు వచ్చాను.. ఈ రోజు బెత్లెహోమ్‌లోని ఓ పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు, ఆయనే మీ అందరికీ ప్రభువు... ఒక పసికందు గుడ్డల్లో చుట్టి, పశువుల తొట్టిలో అమ్మ పొత్తిల్లలో పడుకుని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్లని, అతడే లోకరక్షకుడు’ అని చెప్పాడు. గొర్రెల కాపర్లతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది.

అలా అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుని స్తుతిస్తూ గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువుతోపాటు మేరీ, జోసెఫ్‌లను చూశారు. దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24 న అర్థరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారు.

క్రిస్మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత.

క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతా క్లాజ్ ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. ఇలా ఉంచితే శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకం. క్రిస్‌మస్ రోజున బంధు మిత్రుల ఇళ్ళకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు. క్రిస్‌మస్‌ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖసంతోషాలను తెస్తుందని నమ్ముతారు.

Hope it's Helpful ◉‿◉

Answered by rsplmanohar
0

Answer:

how much big story thank you

Similar questions