About B.R Ambedkar in telugu
Answers
Answer:
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (Marathi: भीमराव रामजी आंबेडकर) (డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ (Marathi: डॉ. बाबासाहेब आंबेडकर) గా కూడా పిలవబడిన) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్ధిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను దళితుల పై అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి మరియు భారత రాజ్యాంగ శిల్పి.[4][5]
భీంరావ్ రాంజీ అంబేడ్కర్
కేంద్ర న్యాయ శాఖ మంత్రి | మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి
పదవీ కాలము
15 ఆగస్టు 1947 – సెప్టెంబరు 1951ప్రధాన మంత్రిజవాహర్ లాల్ నెహ్రూముందుస్థానాన్ని ప్రారంభించారుతరువాతచారు చంద్ర బిశ్వాస్
వ్యక్తిగత వివరాలు
జననం1891 ఏప్రిల్ 14
మౌ, సెంట్రల్ ప్రావిన్సు, బ్రిటిష్ ఇండియామరణం1956 డిసెంబరు 6 (వయసు 65)
రాజకీయ పార్టీషెడ్యూల్ కులాల సంఘంఇతర రాజకీయ పార్టీలురిపబ్లికన్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ [1]జీవిత భాగస్వామి
రమాబాయి (వి. 1906–35)[2]
సవితా అంబేడ్కర్ (వి. 1948–56)[3]
పూర్వ విద్యార్థిముంబై విశ్వవిద్యాలయం బి.ఎ.
కొలంబియా విశ్వవిద్యాలయం ఎం.ఎ., పి.హెచ్.డి.
లండన్ విశ్వవిద్యాలయం ఎం.ఎస్. సి, డి.ఎస్.సి.
గ్రేస్ ఇన్న్ బార్-అట్-లా
ఎల్.ఎల్.డి., డి. లిట్.వృత్తిఆర్ధికవేత్త, రాజకీయ నాయకుడు,సంఘ సంస్కర్తపురస్కారాలుభారత రత్న (మరణాంతరం 1990లో )
ఉన్నత విద్య కోసం కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్ధిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్ధికవేత్త గా పని చేశాడు. తరువాత భారత్ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారత దేశ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956 లో ఇతను బౌద్ధ మతానికి పుచ్చుకోవడం తో దళితులు సామూహికంగా బౌద్ధ మత మార్పిడి చేసుకున్నారు.[6]
1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారత్ దేశ చరిత్ర లో చీరస్మరనియంగా నిలిచిన నాయకుడు.[7] ఇతను చేసిన విశాల కృషికి తన పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు.
విషయ సూచిక
జీవిత విశేషాలుసవరించు
బాల్యంసవరించు

యువకునిగా అంబేద్కర్[8]
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన ‘మౌ’ ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.[9][10][11][12][13] ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామము నివాసులు కావున మరాఠీ నేపథ్యం కలవారు[14]. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు[15][16]. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ లో సుబేదారు గా పనిచేసే వారు.[9][17]
ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్ధిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు. [18]
బాల్యములో అంబేద్కర్ ఎదుర్కొన్న అంటరానితన సమస్యసవరించు
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదురుకున్నాడు.[19] ఆతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గది లో ఒక మూల కూర్చోబెట్టే వారు.[20] మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (peon) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితి అంబేడ్కర్ క్లుప్తంగా - “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.[21]
డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (చాకలి వాడు మహర్ల బట్టలని, మంగలి మహర్లని ముట్టుకునే వారు కాదు) అతని సోదారులే ఇంట్లో బట్టలు వుతకడం, సోదరుల జుట్టు కత్తిరించుకోవడం చేసుకునే వారు. అంబేడ్కర్ తొమ్మిది సంవత్సరాల వయసు లో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణంచేయడానికి ఎడ్ల బండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండి వాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండి వాడు వెనుక నడువగా అంబేడ్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు [5][22]
విద్యాభ్యాసం-ఉద్యోగం-కుల వివక్ష: బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు.పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు.1915లో ఎం.ఏ.,1916లో పి.హెచ్.డి. డిగ్రీలను పొందాడు.ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడింది.1917లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు.అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది
మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు!కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు.సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ ని పై చదువులకి విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ ఆఫీసు జవానులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూచారు.
Answer:
Bhimrao Ramji Ambedkar, who is popularly known as Baba saheb Ambedkar, can rightly be called the father of the Indian Constitution. Ambedkar was the fourteenth child of his Dalit parents who were residents of Ratnagiri in the State of Maharashtra. Ambedkar surname was Ambavadekar, as his family was from the place Ambavade in Ratnagiri. His father was in the British army. It was his Brahmin teacher who changed his name to Ambedkar due to his liking for the pupil. It was also the surname of the teacher. Since then he was known as Ambedkar. He was segregated as untouchable and not allowed to sit inside the classroom along with other students. Ambedkar was very intelligent. He was the only Dalit to be enrolled in Elphinstone High School. His suffering at the hands of upper caste students and society made him to fight against untouchability and caste discrimination. In 1935 he was appointed as the principal of Government Law College, Mumbai. He strongly fought against the caste system in India and published a book, “Annihilation of caste” in which he strongly criticized the then existing discrimination in Indian society. B. R. Ambedkar was the first law minister of independent India. He wrote India’s first constitution, which envisages safety and security to Indians, freedom of religion, abolition of untouchability etc. The constitution was adopted on 26th November by the Constituent Assembly. He later accepted Buddhism along with his followers. He is known for his work as a lawyer, economist, politician and professor. He breathed his last on 6th December 1955. Ambedkar was survived by his second wife Dr. Savita Ambedkar and son Yashwant Ambedkar. His birthday is celebrated as Ambedkar Jayanti and is a public holiday. He was honored with the greatest civilian award Bharat Ratna posthumously in 1990. His fight for equality in the society, against social injustice, concerns for the Dalit people etc should be lessons of inspiration and dedication to all the Indians.