India Languages, asked by manumani, 1 year ago

about Charminar in Telugu

Answers

Answered by Answerseeker
296
క్రి.శ. 1591  లో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత చార్మినార్ నిర్మించబడినది. ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి ఈ చార్మినార్ ముఖ్యమైన కట్టడం గా పేరొందింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ చారిత్రక నిర్మాణం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. చార్మినార్ పేరు 'చార్' మరియు 'మినార్' అనే రెండు ఉర్దూ పదాల నుండి వచ్చింది
చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అని అర్ధం. ప్రాచీన కాలం నాటి అద్భుతమైన నిర్మాణ శైలి వైభవం ఈ కట్టడం సొంతం. ఈ నాలుగు స్థంభాలలో కనిపించే నిర్మాణ శైలి నాలుగు చక్కటి కమానులతో అనుసంధానమై ఉంది. స్థంభాల కి సహకారంగా ఈ కమానులు ఉంటాయి. గోల్కొండ నుండి హైదరాబాద్ ని రాజధానిగా మార్చడానికి ఖులీ ఖుతుబ్ షా వెళ్ళిన తర్వాత ఈ చార్మినార్ నిర్మాణం పూర్తయింది.

ఈ స్మారక చిహ్నం నగరం లో నుండి అంటు వ్యాధి అయిన ప్లేగు వ్యాధిని నిర్మూలించిన దైవ శక్తుల కి కృతజ్ఞతా భావం తో నిర్మింపబడినది. తన గాంభీర్యం తో వేల మంది పర్యాటకులని ఈ చార్మినార్ ఆకర్షిస్తోంది. అంతే కాదు, ఈ ప్రదేశం లో కనబడే పురాతన ప్రపంచపు వైభవం కూడా పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.

Answered by SerenaBochenek
17

1591లో నిర్మించిన చార్మినార్ ("నాలుగు మినార్లు"), భారతదేశంలోని హైదరాబాదులో ఉన్న ఒక స్మారక చిహ్నం మరియు మసీదు. తదుపరి వివరణ దిగువన ఇవ్వబడింది.

Explanation:

  • హైదరాబాద్ కు చిహ్నంగా ఈ ల్యాండ్ మార్క్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మరియు భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలజాబితాలో ఉంది. చార్మినార్ యొక్క సుదీర్ఘ చరిత్ర లో 400 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం దాని పై అంతస్తులో ఒక మసీదు ఉనికిలో ఉంది.
  • చారిత్రకంగా మరియు మతపరమైన పరంగా కూడా ఈ నిర్మాణం చుట్టూ ఉన్న ప్రసిద్ధ మరియు బిజీ స్థానిక మార్కెట్లకు కూడా ప్రసిద్ధి చెందింది, మరియు ఇది హైదరాబాద్ లో అత్యంత తరచుగా సందర్శించే పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా మారింది. చార్మినార్ ఈద్-ఉల్-అధా మరియు ఈద్ అల్-ఫితర్ వంటి అనేక పండుగ వేడుకల ప్రదేశంకూడా.

Learn more:

https://brainly.in/question/24378815

Similar questions