India Languages, asked by krishna36, 1 year ago

about chitrakala in telugu

Answers

Answered by no2
7
952 డిసెంబరు 15న పొట్టి శ్రీరాములుగారు చనిపోయిన నాటికి మన చిత్రకళా రంగంలో ప్రముఖులుగా మూడు తరాలవారు ఉన్నారు. వీరిలో తొలి తరం చిత్రకారులనదగిన వారి వయసులానాటికి యాభై వసంతాలకు కాస్త అటు ఇటుగా వుండగా రెండవ తరంవారు ముప్పై ఐదు, నలభై మధ్య వయస్సు గలవరే. ఈ రెండు తరాల వారు అప్పటికే తమ కళాసృస్టితో ఆంధ్ర చిత్ర కళారంగాన్ని సంపన్నం చేసి వున్నారు. వీరందరికీ ఆద్యుడు 28వ ఏట పిన్న వయస్సులో 1925లోనే తనువు చాలించిన దామెర్ల రామారావు. ఈ తరం వారిలో వరదా వెంకటరత్నం (1895-1963), అడవి బాపిరాజు (1895-1952). రాజమండ్రిలోనే దామెర్ల దారిలో అస్వాల్డ్ కూల్డ్రే శిష్యరికంలో కళాకారులుగా రూపొందగా, ఎస్.ఎన్. చామకుమార్ గా ప్రసిద్ధులైన చామకూర సత్యనారాయణ (1901-1978) మొదట రాజమండ్రిలోనూ, తరువాత బొంబాయిలోనూ నేర్చి చిత్రకారునిగా వృధ్ధిలోనిక వచ్చారు. చామకూర భాష్యకార్లురావు (1896-1971) కూల్డ్రే ప్రోత్సాహంతో బొబాయిలో చిత్రకళాభ్యాసం చేశారు. వి.వి. భాగీరధి (1901-1950) దామెర్ల శిష్యరికం చేసి తరువాత బొంబాయిలో తన కళకు మెరుగులు దిద్దుకున్నవారు. అంకాల వెంకట సుబ్బారావు (1901-1970 ) ఇటు దామెర్ల రామారావు, అటు ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ, ఇద్దరి సహకారంతోనూ తన కళను అభివృధ్ధి పరచుకున్నారు.

అప్పట్లో రాజమండ్రిలో దామెర్ల రామారావు, బందరు ఆంధ్రజాతీయ కళాశాలాధ్యాపకులు ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ మన చిత్రకారులకు మార్గదర్శకులు. కౌతా ఆనందమోహన శాస్త్రి (1908- 1940) బందరు నుండి మైసూరు వెళ్లి ఆనాటి ప్రముఖ చిత్రకారుడు వెంకటప్ప వద్ద కళాభ్యాసం కొనసాగించగా, కౌతా రామమోహన్ శాస్త్రి (1906- 1976) బందరు నుండి నేరుగా ఇంగ్లాండ్ వెళ్ళారు. మాధవపెద్ది గోఖలే (1917-1981) బందరు నుండీ, హోతా వెంకటరామగోపాల్ (1923-1979) రాజమండ్రి నుండీ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్సుకు వెళ్లారు. మోక్కపాటి కృష్ణమూర్తి (1901-1962), కోడూరి రామ్మూర్తి (1917-1978) నేరుగా మద్రాస్ వెళ్లారు.

1953లో మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికి వీరూ, విజయనగరంలో అంట్యాకుల పైడిరాజు, వారి శిష్యుడు కళ్యాణ ప్రసాదు శర్మ, గుంటూరు ప్రాంతాన గోలి శేషయ్య, గుర్రం మల్లయ్య, సి.యస్.యన్. పట్నాయక్, వివిధ ప్రాంతాల్లో దేవీ ప్రసాద్ నారాయణరావు, కె. శ్రీనివాసులు, వేలూరి రాధాకృష్ణ, దామెర్ల సత్యవాణి, కుమారిల స్వామి, పిలకా లక్ష్మీ నరసింహమూర్తి, తేజోమూర్తుల కేశవరావు మున్నగువారు చాలామందే ప్రముఖులుగా ఉండేవారీ చిత్ర - శిల్ప కళారంగంలో. వీరందరూ జాతీయోద్యమ లక్ష్యంతో చిత్రరచన చేసినవారు కూడా కావటాన, అప్పట్లో మన కళారంగం చిన్నదే కావటానా ప్రజలకు వీరంతా సుపరిచుతులుగా వుండేవారు.

is it okk
Similar questions