About Desha rakshana essay in Telugu
Answers
Explanation:
మొదటి కాశ్మీర్ యుద్ధం సవరించు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యమయిన కాశ్మీర్‌ను పాలిస్తున్న మహారాజు ఇటు భారత దేశంలో లేదా అటు పాకిస్తాన్‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి భారత దేశంలో కాశ్మీర్‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు. అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని wపంపి పాకిస్తాన్ సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టసాగింది. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది.
గోవా, డామన్-డయ్యు ఆపరేషన్ సవరించు
బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక గోవా, డామన్ డయ్యులను తన ఆధీనంలో ఉంచుకున్నది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకొనలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.
భారత్ పాక్ యుద్దం 1965 సవరించు
దస్త్రం:18Cav on move.jpg
1965 యుద్ధంలో ముందుకు వెళ్తున్న భారత యుద్ధ ట్యాంకులు
చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన భారత్ మరో యుద్ధానికి సిద్దం కాలేదు, కాశ్మీర్ ప్రజలు పాకిస్తానుకు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో 1965లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌ను ఆక్రమించుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యుద్ధంలోనే అత్యధికంగా యుద్ధ ట్యాంకులను ఉపయోగించారు. భారత ఆర్మీ హోరాహోరీగా పోరాడి అందుబాటులో ఉన్న యుద్ధం ట్యాంకులన్నీ వినియోగించి పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. భారత్ 128 ట్యాంకులను నష్టపోయింది. 150 పాక్ ట్యాంకులను ధ్వంసం చేసి 152 ట్యాంకులను చేజిక్కించుకొంది. తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి - అయూబ్ ఖాన్‌ల మధ్య జరిగిన సంధితో ఈ యుద్ధం ముగిసింది.
భారత్ పాక్ యుద్దం 1971 సవరించు
1971లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జరిగిన తిరుగుబాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారతదేశాని రావడంతో భారత్-పాక్ యుద్ధం మొదలయింది. తూర్పు పాకిస్తాన్‌కు పశ్చిమ పాకిస్తాన్ నుండి విమోచన కల్పించడం భారత్‌కు అన్ని విధాలా శ్రేయస్కరమయింది. తన బలగాలన్నిటినీ పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) వైపే గురి పెట్టగలిగింది. భారత సైన్యం జనరల్ అరోరా నేతృత్వంలో పాక్ సైన్యాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి 90,000 యుద్ధ ఖైదీలను పట్టుకొంది. పాక్ ఓటమిని అంగీకరించడంతో ఈ యుద్ధం ముగిసింది.
కార్గిల్ యుద్ధం సవరించు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత్ తన సైన్యాన్ని కొన్ని హిమాలయ ప్రాంతాల్లో నుండి వెనక్కు రప్పించిన కొద్ది రోజులకు 1999లో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి ఆ ప్రాంతాలు ఆక్రమించుకుంది. నెమ్మదిగా కీలకమయిన బటాలిక్, ద్రాస్ మరియు టైగర్ హిల్‌లను ఆక్రమించుకోవడంతో భారత్ 2,00,000 మంది సైన్యాన్ని సిద్దం చేసింది. కార్గిల్ యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకున్న పరిమితులవల్ల 30,000 మంది మాత్రమే పాల్గొన్నారు. సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది.
వర్గీకరణ సవరించు
డివిజన్: మేజర్ జనరల్ ఆధ్వర్యం వహించే ప్రతి డివిజన్‌లో 15,000 మంది యుద్ధవిద్యల్లో ఆరితేరినవారు, 8,000 వారికి సహాయకులు ఉంటారు. ప్రస్తుతం ఆర్మీలో 34 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్‌లో కొన్ని బ్రిగేడ్‌లు ఉంటాయి.
బ్రిగేడ్: ప్రతి బ్రిగేడ్‌లో 4,000-5,000 మంది సైనికులు ఉంటారు. బ్రిగేడ్ అధికారిని బ్రిగేడియర్ అని పిలుస్తారు. ప్రతి బ్రిగేడ్‌లో కొన్ని బెటాలియన్‌లు ఉంటాయి
బెటాలియన్: కల్నల్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే ప్రతి బెటాలియన్‌లో 900 కంటే ఎక్కువమంది సైనికులు పనిచేస్తుంటారు.
కంపెనీ: మేజర్ ఆధ్వర్యంలో పనిచేసే కంపెనీలో 120 సైనికులు ఉంటారు.
ప్లటూన్: 32 మంది సైనికులు కల దీనికి లెఫ్ట్‌నెంట్ అధికారి.
సెక్షన్: హవల్దార్ లేదా సార్జంట్ నాయకత్వం వహించే సెక్షన్‌లో 10 మంది సైనికులు ఉంటారు.
ప్రస్తుత ఆర్మీలోని కొన్ని విభాగాలు:
4 రాపిడ్ డివిజన్లు
18 ఇన్‌ఫాంట్రీ డివిజన్లు
10 మౌంటైన్ డివిజన్లు
2 ఫిరంగి డివిజన్లు
6 ఎయిర్ డిఫెన్స్ బ్రిగేడులు
1 పేరాచూట్ బ్రిగేడ్
4 ఇంజనీర్ బ్రిగేడులు
14 హెలికాప్టర్ యూనిట్లు
63 ట్యాంక్ రెజిమెంట్లు
200 ఫిరంగి రెజిమెంట్లు