India Languages, asked by princessparul4984, 1 year ago

About dog 5lines in telugu

Answers

Answered by umairrao
49
plz mark it as brainliest
Attachments:
Answered by minatisenapati89
12

Boldsky Telugu

బోల్డ్ స్కై » తెలుగు » మన ఇల్లు--పూతోట » పెంపుడు జంతువుల జాగ్రత్త

మనుష్యులు కుక్కలంటేనే ఎక్కువగా ఇష్టపడుతారెందుకు..?

By Super

Published: Sat, May 21, 2016, 7:00 [IST]

మీకు కనుక ఒక పెంపుడు జంతువుంటే మీ ఇద్దరి మధ్యనా మెల్లిగా సాన్నిహిత్యం పెరిగి బంధం బలపడుతుంది.పిల్లి, పక్షి ఇలా ఏది పెంచుకున్నా మీ ఇద్దరి మధ్యా ఒక అవగాహన వస్తుంది.

అదే కుక్కల విషయానికొస్తే మాత్రం,అవగాహనే కాదు మీ ఇద్దరి మధ్యా నిజమైన స్నేహం అంకురిస్తుంది.కుక్కలు మనుష్యుల నిజమైన నేస్తాలు అని నిజమే చెప్పారు. ఈ వాక్యాన్ని అర్ధం చేసుకున్న వారే కుక్కలని పెంపుడు జంతువులుగా తెచ్చుకుంటారు.అసలింతకీ ఇతర జంతువులని కాదని కుక్కలనే ఇష్టపడటానికి గల కారణమేమిటి??

మీ ఆక్వేరియంలో ఉన్న చేపలు మీతో మాట్లాడలేవు లేదా మీ పిల్లలతో ఆడలేవు.అదే ఒక కుక్క పిల్ల ఉంటే మీరెంత ఒత్తిడితో రోజు గడిపి ఇంటికొచ్చినా అది మీ ఒత్తిడిని మటుమాయం చేస్తుంది.

Why People Love Dog Over Other Pet Animals

కుక్కలు, మనుష్యుల మధ్య బాంధవ్యం కొత్తది కాదు.అనాది నుండీ మనుష్యుడి పక్కన ఉన్నది కుక్కలే.

గుర్రాలు లేదా ఆవుల వంటి జంతువులని కొన్ని పనుల నిమిత్తం పెంచుకుంటారు.అదే కుక్కలయితే మనుష్యులతో పాటు ఊండి వారికి స్నేహితులవుతాయి.అనాది నుండీ ఇదే జరుగుతోంది.ఇంతకీ కుక్కలనే ఎక్కువ ఇష్టపడడానికి గల కారణాలేమిటో చూద్దామా??

మీకు కనుక కుక్కలు ఇష్టమయితే క్రింద మేము చెప్పిన కారణాలతో మీరు ఏకీభవిస్తారు.మీకు కనుక అస్సలు పెంపుడు జంతువులు ఇష్టం లేకపోయినా సరే ఈ కారణాలు చూస్తే వెంటనే వెళ్ళి ఒక పెంపుడు జంతువుని తెచ్చుకుంటారు.మనుష్యులు కుక్కలని అమితంగా ప్రేమించడానికి గల కారణాలు చదివి తెలుసుకోండి.

1.మీకు సెక్యూరిటీ:

"కుక్క ఉన్నది జాగ్రత్త" అన్న బోర్డు ఉన్న ఇళ్ళు మీరు చూసే ఉంటారు.అవును, మీ ఇంట్లో కనుక ఒక కుక్క ఉంటే దొంగలు లేదా ఇతర చొరబాటుదారులు మీ ఇంట్లోకి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు మరి.నేరస్తులు 5 అడుగుల దూరంలో ఉండగానే కుక్క పసిగట్టి మిమ్మల్ని అలర్ట్ చెయ్యడానికి నిరంతరాయంగా మొరుగుతూనే ఉంటుంది.

Why People Love Dog Over Other Pet Animals

2.మీ ఇంట్లో ఇంకో పిల్ల/పిల్లవాడు:

కుక్కలంటే మనుష్యులకి ఎందుకంత ప్రేమ?? ఎందుకంటే కుక్క పిల్లలు కూడా మీ పిల్లల లాగే మీ ప్రేమని ,అటెన్షన్నీ డిమాండ్ చేస్తాయి కాబట్టి. ఒక కుక్క పిల్ల ఉంటే మీ ఇంట్లో సందడికి లోటుండదు. పిల్లలు వద్దనుకున్న ఆడవారు లేదా పిల్లలు కలగని స్త్రీలు కుక్కని పెంచుకుంటే చిన్న పిల్లలని పెంచిన అనుభూతే కలుగుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి.

Why People Love Dog Over Other Pet Animals

3.షరతులు లేని ప్రేమ:

మీ కుక్కతో ఉంటే మీరెన్నడూ ఒంటరి కాదు. స్నేహితులు, బంధువులు వచ్చి పోతుంటారు కానీ కుక్క మాత్రం తన ఆఖరి క్షణం వరకూ మీతోనే ఉంటుంది.మీరెంత అందంగా ఉన్నారు లేదా మీరెంత సంపాదిస్తునారు ఇవన్నీ దానికి అనవసరం, దానికి కావాల్సిందల్లా మీ స్నేహం మరియూ ప్రేమ మాత్రమే.

Why People Love Dog Over Other Pet Animals

4.నిత్యం మీతోనే ఉండే మీ భాగస్వామి:

మీకు కనుక పెంపుడు కుక్క ఉంటే ఇతరుల కంపెనీ అక్కర్లేదు.పిల్లలు, కుక్కల మధ్య ఏర్పడ్డ బలమైన బంధాల గురించి ఎన్నో అద్భుత కధలు మనకి తెలుసు.మీరు దగ్గర లేనప్పుడు కుక్కలు మీ పిల్లలకి కాపలా కాస్తుంటాయి, అందువల్లే మిగతా పెంపుడు జంతువుల కంటే కుక్కలంటేనే చాలా మంది ఇష్టపడతారు.

5.మనుష్యులని అర్ధం చేసుకుంటాయి:

వాసన పసి గట్టడంలో కుక్కలు మనుష్యుల కంటే 100% నయం. మీరొక వ్యక్తిని కలిసినప్పుడు మీరు కనుక ఆ వ్యక్తి తో అసౌకర్యవంతంగా ఉన్నట్లయితే మీ కంటే మీ పెంపుడు కుక్క ముందు రియాక్ట్ అవుతుంది.మీ కుక్కకి ఎవరి నుండయిన నెగెటివ్ వైబ్స్ వస్తే కనుక ఆ వ్యక్తి తో మీ సంభాషణని పొడిగించాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.

6.కుక్కలతో సమయం గడపడం సరదాగా ఉంటుంది:

అసలు మిగతా పెంపుడు జంతువులు కాకుండా కుక్కలనే ఎందుకు ఎంచుకోవాలో అని ఆలోచిస్తే కనుక అవి పంచి ఇచ్చే వినోదం గురించి ఒక్కసారి ఆలోచించండి.ఫ్రిజ్బీ,దాగుడు మూతలు వంటి ఆటలు వాటితో ఆడుకోవడం ఎంత సరదాగా ఉంటుందో.మీ వేసవి కాలపు పిక్నిక్కు ఫోటోలకి మీ పెంపుడు జంతువులతో ఆడుతున్నప్పటి ఫోటోలు అదనపు ఆకర్షణ.

7.కుక్కలు మీ కోసం ఎదురుచూస్తాయి:

అసలు అన్ని జంతువులలోకెల్లా కుక్కలనే ఎందుకు పెంపుడు జంతువులుగా ఉంచుకోవడానికి ఇష్టపడతారొ చెప్పడానికి ఈ కారణానికి మించి ఇంకొకటి ఉండదు.మీరెంత లేటుగా ఇంటికి రండి, మీ పెంపుడు కుక్క మీ కోసం ఎదురుచూస్తుంటుంది, మీకు ప్రియమైన వారు ఎదురు చూసినా చూడకపోయినా కానీ. తన యజమాని చనిపోయిన తరువాత ఆ వ్యక్తి యొక్క పెంపుడు కుక్క కూడా జబ్బు పడి మరణించిన సందర్భాలెన్నో ఉన్నాయి.

Similar questions