About Ganesh Chaturthi essay in Telugu 150-200 words
Answers
వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. 1. మాచీ పత్రం/మాచ పత్రి 2. దూర్వా పత్రం/గురక 3. అపామార్గ పత్రం/ఉత్తరేణి 4. బృహతీ పత్రం/ములక 5. దత్తూర పత్రం/ఉమ్మెత్త 6. తులసీ పత్రం/తులసి 7. బిల్వ పత్రం/మారేడు 8. బదరీ పత్రం/రేగు 9. చూత పత్రం/మామిడి 10. కరవీర పత్రం/గన్నేరు 11. మరువక పత్రం/ధవనం, మరువం 12. శమీ పత్రం/జమ్మి 13. విష్ణుక్రాంత పత్రం/ 14. సింధువార పత్రం/వావిలి 15. అశ్వత్థ పత్రం/రావి 16. దాడిమీ పత్రం/దానిమ్మ 17. జాజి పత్రం/జాజిమల్లి 18. అర్జున పత్రం/మద్ది 19.దేవదారు పత్రం 20. గండలీ పత్రం/లతాదూర్వా 21. అర్క పత్రం/జిల్లేడు.
సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించ సాగాడు.
కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లుగా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని' వేడు కొన్నాడు.
అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థ
Explanation:
hope it is helpful to you
pls mark as brainlist