India Languages, asked by minnisljprss, 1 year ago

about కుమ్మరి in telugu for project

FAST!! FAST!! FAST!!

Answers

Answered by KGB
54
వికీపీడియా నుండి

'కుమ్మరి (కులం) ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కులాల , శాలివాహన పేర్లతో కూడా ఈకులాన్ని పిలుస్తారు. మట్టితో కుండలనుచేయువానిని కుమ్మరి (Potter) అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరం (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టి గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ధ, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పని సరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు.

----------------------------------------------------------------------------------------------------

ప్రదేశం[మార్చు]

అతి పెద్ద కులాలలో కుమ్మరి ఒకటి. ఇది భారతదేశం లోని 212 జిల్లాలలో విస్తరించి యున్నది. ఈ కులంవారు భారతదేశ రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రదేశాలు మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉన్నారు. ఈ కులంవారు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల నామాలతో పిలువబడుతున్నారు.

----------------------------------------------------------------------------------------------------------

మూల కధలు,చరిత్రలు[మార్చు]ప్రతీ రాష్ట్రంలో ఈ కులానికి సంబంధించి ఒక్కో చరిత్ర ఉంది. కుమ్మరులు భారతీయ హిందూ దేవతలైన త్రిమూర్తులు (బ్రహ్మ,విష్ణు మరియు శివుడు) ఆశీస్సులతో భూమిపై అవతరించామని చెపుతారు.వారికి బ్రహ్మదేవుడు ఈ కళను అందిచాడనీ, విష్ణువు తన చక్రాన్ని అందించాడనీ మరియు లయకారకుడైన శివుడు తన రూపాన్ని అందించాడని అంటారు.వారి మొదటి ఉత్పత్తి నీటి కుండ.ఒకరోజు బ్రహ్మ తన కుమారులకు చెరకు గడను భాగాలుగా చేసి యిచ్చాడు. వారిలో ప్రతీ ఒక్కరూ దానిని తిన్నారు. కానీ కుమ్మరి తన పనిలో నిమగ్నమై ఆ చెరకు ముక్కను తినడం మరచిపోయాడు.ఆ చెరకు ముక్క మట్టి కుప్పపై ఉంచాడు. అది వేర్లు తొడిగి చెరకు మొక్కగా పెరిగింది. కొన్ని రోజుల తరువాత బ్రహ్మ తన కుమారులను చెరకు గురించి అడిగాడు. కానీ ఎవరూ తిరిగి యివ్వలేకపోయారు. కానీ కుమ్మరి చెరకు పూర్తి మొక్కనే యిచ్చాడు. బ్రహ్మ కుమ్మరి యొక్క ఏకాగ్రతను మెచ్చుకొని ప్రజాపతి బిరుదు నిచ్చాడు.విక్రమాదిత్యుడితో’ యుద్దంలో శాలివాహనుడికి సైన్యం లేకపోతే శాలివాహనుడిది కుమ్మరి కులవృత్తి కాబట్ తమ కులదేవత ’నాగేంద్ర స్వామి" మహిమతో అప్పట్టి కప్పుడు ’మట్టిబొమ్మలు " తయారు చేసి వాటికి ప్రాణం పోసి, ఆ బొమ్మల సైన్యం సహాయం తోనే యుద్దం చేసి, విక్రమాదిత్యుడిని ఓడించి "రాజ్యాధికారం" చేపట్టి మన జాతిని జనరంజకంగా పాలించాడట. ఆయన వంశమే తర్వాత"శాతవాహన వంశం" గా పేరుగాంచి నాలుగు వందల యేండ్లు తెలుగునాట రాజ్య పాలన చేసారు.
-----------------------------------------------------------------------------------------------------
శాలివాహనులు[మార్చు]

1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 28, బిసిడబ్ల్యు (ఎమ్‌ఐ) శాఖ, ప్రకారం శాలివాహన కులం కూడా కుమ్మరి కులంగా పరిగణింపబదినది. భారతీయ శాసనాలు మరియు ఇండోనేషియా మరియు ఇండో చైనాలలోని ప్రాచీన సంస్కృత శాసనాలు ప్రకారం ఈ విషయం చెప్పబడింది. శాలివాహన శకాన్ని తెలియజేసే కాలెండరును భారత ప్రభుత్వం 1957 నుండి తొలగించింది. దీనిని కనిష్క మహారాజు స్థాపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు(ఆలం+ఊరు=యుద్దం జరిగిన ఊరు) దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడని ,శాతవాహనుడు కుమ్మరి కులస్తుడని ఒక నానుడి. బౌద్ధ సాహిత్యాన్ని బట్టి దక్షిణ దేశ చరిత్రను క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి మనం అంచనా వేయ వచ్చు. శాతవాహనులు రూపొందిన విధానం గురించి కె.కె రంగనాధ చార్యులు ఇలా విశ్లేషిస్తున్నారు.కోసల దేశానికి సంబంధించిన బావరి అనే బ్రాహ్మణుడు దక్షిణాపథానికి వచ్చి గోదావరీ తీరంలో అస్సక జాతివారు నివసించే ప్రాంతంలో స్థిరపడ్డాడు. అతను తన శిష్యులతో బాటు ఊంఛ వృత్తితో జీవించే వాడు. క్రమంగా ఒక గ్రామం వెలసింది. ఒక మహాయజ్ఞం కూడా నిర్వహించాడు. ముసలి తనంలో తన శిష్యులను బుద్ధుడి దగ్గరకు పంపించి సందేహాలను తీర్చుకుని బౌద్ధుడయ్యాడు. బావరి దక్షిణానికి వచ్చిన తర్వాతనే దక్షిణదేశం ఆహారాన్ని సేకరించుకునే దశనుంచి అహోరోత్పత్తి చేసుకునే దశకు వచ్చివుండాలని చారిత్రకుల ఊహ. పైన పేర్కొన్న అస్సక జాతివారే తరువాత శాతవాహనవంశంగా రూపుదిద్దుకున్నారు. బావరి సాంప్రదాయంలో శాతవాహనులు బ్రాహ్మణులను గౌరవించి యజ్ఞాలు చేశారు. ( తెలుగు సాహిత్యం మరోచూపు, కె.కె.రంగనాద చార్యులు పేజి: 2)--కత్తిపద్మారావు (విశాలాంధ్ర 25.7.2010)

-------------------------------------------------------------------------------------------------------

Answered by sarankarthikkompella
21

Answer:

hope this HELPS you

make me BRAINLIST

Attachments:
Similar questions