about jhansi Lakshmi bhai in Telugu 300 words
Answers
Answer:
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) About this sound pronunciation (సహాయం·సమాచారం); నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు., భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డు వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం "జోన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.[1]
రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి
1828 – 17 జూన్ 1858
Ranilaxmibai-1.JPG
రాణీ లక్ష్మీబాయి విగ్రహం
ఇతర పేర్లు:
మను, మనికర్ణిక
జన్మస్థలం:
కాశీ
నిర్యాణ స్థలం:
గ్వాలియర్,భారత్
ఉద్యమము:
భారత స్వాతంత్ర్యోద్యమం
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది.
పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.