India Languages, asked by kuruvavijaya12338, 1 month ago

about mother in telugu​

Answers

Answered by hegde5
2

Explanation:

కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.

పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.

సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.

పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.

Similar questions