About nature in telugu essay
Answers
Answer:
Explanation:
కళ్లు చెదిరే ప్రకృతి సోయగాలతో ఊటి పచ్చటి శోభను సంతరించుకుంది. పచ్చటి కొండలు.. గలగల పారె సెలయేరులు.. పుసుపు వర్ణం అద్దుకున్న పూల తోటులు.. అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే తరగనన్ని మనసు దోచు అందాలు రారమ్మని పిలుస్తున్నాయి. ప్రకృతి రమణీయతతో మంత్రముగ్దులను చేసే ఆంధ్రా ఊటీ అరకు ముస్తాబవుతోంది.
ఆగష్టు - సెప్టంబర్ మాసాలు వస్తే చాలు.. ప్రకృతి ప్రేమికులందరూ ఎంచక్కా... అరుకులో వాలిపోతారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ సుందర అందాలను తిలికించేందకు మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు, విధేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి విడిది చేస్తారు. ఏజన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉన్న ఏ మాత్రం లెక్క చేయని పర్యాటకులు ప్రకృతి పరిమళాన్ని ఆస్వాదించటంతో పాటు ప్రకృతి అందాల మధ్య తమ మధుర జాపకాలను కెమోరా, వీడియో క్యామ్ లలో బంధిస్తారు. చలి కాలం ముగిసేంత వరకు ఇక్కడ పర్యాటకులు విడిది చేస్తుంటారు.