India Languages, asked by rizzubaig3418, 1 year ago

About parents in Telugu

Answers

Answered by Anonymous
3
Here is the answer

తల్లి తండ్రులు దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. వారు చూపే ప్రేమ ఎవ్వరూ చూపరు. వారు కొన్ని సార్లు పిల్లలకోసం వారి జీవితాలను త్యాగం చేస్తారు. పిల్లల ఆనందమే వారి ఆనందంగా భావిస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి ఊహ వచేంతవరకూ వారే అన్నీ చేస్తారు. తల్లి తండ్రులు పిల్లలకు ఎంతో ప్రేమతో గోరుముద్దలు పెడతారు. మన జీవితమే వారి జీవితంగా భావించే ఏ భంధమైనా ఉంది అంటే అది తల్లితండ్రుల భంధమే. ఇది కేవల భంధం మాత్రమే కాదు, ప్రేమానురాగాల అనుభంధం.

వారిప్రేమలో స్వార్ధం ఉండదు. కల్మషం ఉండదు. వారి కష్టార్జితాన్ని అంతా పిల్లల కోసమే ఉపయోగిస్తారు. పిల్లల చదువుల కోసము, వారి భవిష్యత్తు కోసము మాత్రమే ఉపయోగిస్తారు. పిల్లలు పెద్దవాల్లైన తర్వాత వాల్లని చూస్తారా లేదా అని కూడా ఆలోచించకుందా మోత్తం సంపాదన అంతా పిల్లలకోసమే ఉపయోగిస్తారు. మనం బాగా చదువుకుని గొప్పవాల్లమైతే మొదటిగా సంతోషించేది తల్లితంద్రులే. అందుకే మాత్రుదేవో భవ, పిత్రుదేవో భవ అని అంటారు. తల్లితండ్రులు మనకు కనిపించే దేవుల్లవంటివారు.

Similar questions