India Languages, asked by vrnamburi6, 27 days ago

about pegion in telugu​

Answers

Answered by Anonymous
29

Answer:

పావురం:-

పావురం ఒక పక్షి . పావురాలు దాదాపు 26 మైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా గుర్తిస్తాయి. అందుకే యుద్ధాల్లో శత్రు సైన్యాలను గుర్తించేందుకు పావురాలను ఉపయోగించేవారు. అంతేకాదు, వీటికి ఏకాగ్రత ఎక్కువ. ఎలాంటి దారిలోనయినా కన్‌ఫ్యూజ్ అవకుండా వెళ్లిపోగలవు. అందుకే సందేశాలను వీటితో పంపించేవారు!. పావురాలు జీవితంలో ఒక్కదానితోనే జతకడతాయి. చాలా పావురాలు తమ జంట పావురం చనిపోతే మరో దానికి దగ్గర కాకుండా అలాగే ఉండిపోతాయని పరిశోధనల్లో తేలింది!. కపోతాలు చెట్లు, కొండచరియలు, ఆపార్టుమెంటుల మీద పుల్లలతో గూడు కట్టుకుంటాయి. ఇవి ఒకటి లేదా రెండు గుడ్లు పెడతాయి. పిల్లల్ని ఆడమగ పక్షులు రెండూ సంరక్షిస్తాయి. పిల్లలు 7 నుండి 28 రోజుల తర్వాత గూడు వదిలి ఎగిరిపోతాయి. పావురాలు గింజలు, పండ్లు, చిన్న మొక్కల్ని తింటాయి. చాలామంది కపోతం అనే పేరు బదులు పావురం అనే పదం వాడతారు.

Attachments:
Similar questions