about sankranti in Telugu 150 words
Answers
సంక్రాంతి పండుగ గురించి ఒక చిన్న వ్యాసం :
సంక్రాంతి అనగా అర్ధం సంక్రమణం అని, అంటే మారడం. ఏ రోజున ఐతే సూర్యుడు క్రమంగా పూర్వ నుండి ఉత్తరరాశికి మారుతాడో పైగా అదే రోజు మేష ద్వాదశం అవుతుందో ఆ రోజునే మనం సంక్రాంతిగా జరుపుకుంటాం .
హిందువులకు సంక్రాంతి ఒక పెద్ద పండుగ. పుష్యమాసం, హేమంత ఋతువు, మంచుతో నిలిచే ఆహ్లాదకరమైన వాతావరణం మకర సంక్రాంతికి స్వాగత చెప్తాయి. జనవరి 15న సూర్యుడు ఉత్తరాయణం లోనికి అడుగుపెడతాడు, కావున పురాణాలు చెప్పేది ఏమిటంటే ఆ రోజున నుండి స్వర్గ ద్వారాలు తెరుచుకుని ఉంటాయి.
ఈ పండుగను ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటారు. భోగి, మకర సంక్రమణం, కనుమ. గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు , ఊరంతా ముగ్గులు, ఆకాశాతా గాలిపటాలు, భోగిపళ్లు వేయటం, కోడి పందాలు, ఎన్నో రకాల పోటీలు, పిండి వంటలు, ప్రతి సాయంత్రం ఆటలు పాటలు, నాటకాలు, బొమ్మల కొలువులు, భోగి మంటలు ఇంకా ఎన్నో విశిష్టతలతో వస్తుంది ఈ పండుగ. అందుకే ఆంధ్రులకు ఇది ప్రియం.
Learn more :
1. మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.
https://brainly.in/question/14590444
2. గాలిపటాలు గురించి కొన్ని మాటల్లో.
https://brainly.in/question/4607556