Environmental Sciences, asked by NobiShizuka, 4 months ago

About Shathaka padyalu in Telugu language

Congo BRAINLYSOUMYA99 for 1k☺️​

Answers

Answered by BRAINLYSOUMYA99
13

Answer:

శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.

"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు.

శతకం లక్షణాలు

శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.

సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.

మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.

శతక వాఙ్మయము ప్రగతి

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (క్రీ.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.

తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.

బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరం గా కూడా చాలా శతకాలున్నాయి.

కొన్ని శతకాలు

  • శ్రీ కాళహస్తీశ్వర శతకము – ధూర్జటి
  • వేమన శతకము - వేమన
  • సుమతీ శతకము- బద్దెన (భద్ర భూపాలుడు)
  • దాశరథీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)
  • భాస్కర శతకము - మారవి వెంకయ్య

Tqu so much Mr.Nobitha♡

Answered by Anonymous
1

Answer:

answer :

all the three R's help to cut down on the amount of waste we throw away. They conserve natural resources, landfill space and energy. Plus, the three R's save land and money communities must use to dispose of waste in landfills.

sorry ..

merru Telugu ah ??

have a great day

keep smiling always..

Similar questions