About sparrow in Telugu
Answers
నిజమైన పిచ్చుకలు పేసరిఫార్మిస్ క్రమంలో పేసరిడేకుటుంబానికి చెందిన చిన్న పక్షులు. ఇవి సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగివుంటాయి. వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి. పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి, కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. గల్స్ లేదా కొండ పిచ్చుకలు పట్టణాలలో నివసించి ఏదైనా తింటాయి. ఇవి Chestnut Sparrow (Passer eminibey) 11.4 సె.మీ. (4.5 అంగుళాలు) మరియు 13.4 గ్రా., నుండి Parrot-billed Sparrow (Passer gongonensis), at 18 సె.మీ. (7 అంగుళాలు) మరియు 42 గ్రా. (1.5 oz) మధ్యలో ఉంటాయి. పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఇతర గింజలను తినే పక్షుల లాగే ఉండి, పృష్ఠ బాహ్య ఈకలు అవశేషాలుగా మారతాయి, నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.[1]
ఈ నిజమైన ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాలో విస్తరించాయి. ఆస్ట్రేలియా మరియు అమెరికాఖండాలలో విస్తరించి, పట్టణాలలో బాగా స్థిరపడ్డాయి.అమెరికా పిచ్చుకలు లేదా ఆధునిక పిచ్చుకలు వీనికి కొన్ని పోలికలున్నా, చాలా భిన్నమైనవి. ఇవి ఎంబరిజిడేకుటుంబానికి చెందినవి. ఇలాగే హెడ్జ్ పిచ్చుక లేదా డన్నక్ (Prunella modularis) కూడా అసలు పిచ్చుకలకు సంబంధించినది కాదు.
జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం'గా పరిణమించింది. పిచ్చుక జాతి అంతరించనుంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి. పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలు. సెల్యూలర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి. కృత్రిమమైన పిచ్చుకగూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించవచ్చని శాస్త్రవేత్తల సలహా.[2] గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లల్లో విరివిగా వుండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కొరకు వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరుకు వేలాడ దీసె వారు. ప్రస్తుతం పంటలు లేక పిచ్చుకలకు ఆహారం కరువై ఇంకా అనేక కారణాల వలన పల్లెల్లో అవి కనబడడం లేదు. ఆ జాతి క్షీణ దశలో వున్నటు గ్రహించ వచ్చు. నిజమైన పిచ్చుకలో ఇంచుమించు 35 జాతులున్నాయి. ఈ దిగువన పేర్కొన్నవి పూర్తి జాబితా.
Answer:
నిజమైన పిచ్చుకలు పేసరిఫార్మిస్ క్రమంలో పేసరిడే కుటుంబానికి చెందిన చిన్న పక్షులు. ఇవి సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగివుంటాయి. వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి. పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి, కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. గల్స్ లేదా కొండ పిచ్చుకలు పట్టణాలలో నివసించి ఏదైనా తింటాయి. ఇవి Chestnut Sparrow (Passer eminibey) 11.4 సె.మీ. (4.5 అంగుళాలు), 13.4 గ్రా., నుండి Parrot-billed Sparrow (Passer gongonensis), at 18 సె.మీ. (7 అంగుళాలు), 42 గ్రా. (1.5 oz) మధ్యలో ఉంటాయి. పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఇతర గింజలను తినే పక్షుల లాగే ఉండి, పృష్ఠ బాహ్య ఈకలు అవశేషాలుగా మారతాయి, నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.[1]
Explanation:
I hope it helps you mark me as brainlist answer