India Languages, asked by wecwc6189, 1 year ago

about telephone in telugu few lines

Answers

Answered by joshuakumarj23
0
టెలిఫోను (దూరవాణి) అనేది దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాల నుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమం ద్వారా చేరవేసే పరికరం. టెలీఫోను (గ్రీకు భాష నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు, ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది.

టెలిఫోన్ (దూరవాణి) లో ముఖ్యమైన భాగములు, మైక్రోఫోన్ (ట్రాన్స్ మీటరు) మాట్లాడుటకు, మరియు రిసీవర్ (వినుటకు) ఉంటాయి. ప్రతి టెలీఫోన్ కు ఒక సంఖ్య ఉంటుంది. దానికి వేరొక ఫోన్ తో చేసినపుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినబడుతుంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్ లు రోటరీ డయల్ (నంబర్లు త్రిప్పుట) తో పనిచేయసాగాయి. కానీ 1963 లో AT&T అనే సంస్థ పుష్ బటన్ డయల్ తెలీఫోన్లను మొదట ప్రవేశపెట్టింది[1]. రిసీవర్ మరియు ట్రాన్స్ మీటర్ లు ఒకే హాండ్ సెట్ కు అమర్చి ఒకేసారు మాట్లాడుటకు, వినుటకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హాండ్ సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్ కు అనుసంధానించబడుతుంది.

లాండ్ లైన్ టెలీఫోన్ టెలిఫోన్ నెట్ వర్క్ కు తీగల ద్వారా, మొబైల్ ఫోన్, సెల్యులర్ ఫోన్ లు టెలిఫోన్ నెట్ వర్క్ కు రేడియో ప్రసారాల ద్వారా, కార్డ్ లెస్ ఫోన్ లో హాండ్ సెట్ నుండి ఫోన్ కు రేడియో ప్రసారాలద్వారా టెలిఫోన్ ఎక్సేంజికి అనుసంధానబది ఉంటుంది. ప్రసారిణి (Transmitter) టెలిఫోన్ నెట్ వర్క్ నుండి టెలిఫోన్ గ్రాహకం వరకు శబ్ద తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి పంపుతుంది. టెలిఫోన్ లోని గ్రాహకం వచ్చిన విద్యుత్ సంకేతాలను మరల శబ్ద తరంగాలుగా మార్చుతుంది.

Similar questions