about Telugu language paragraphs in Telugu
Answers
Answer:
మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకో కూడదు. తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు. పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం. ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ , పశ్చిమ ఆసియా లోనూ , ఆంధ్ర తెలంగాణ లోనూ ప్రతి సంవత్సరం జరుగుతాయి. అమెరికా తెలుగు వారింకా తెలుగుని గౌరవిస్తున్నారంటే, దానర్ధం తెలుగు చాలా గొప్పదనేగా.
తెలుగువారి మంచి మనసు, వేరే భాషలవారిని ఆదరించే గుణం లోనే తెలుస్తుంది తెలుగు తీపి, తెలుగు వారి గొప్పతనం.
తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి. అన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.
మన భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం , భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం న్యాయం కాదు పద్ధతి కాదు. అది మాతృ ద్రోహం చేయడమే.
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు.
ఈ సమాధానం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.....
Answer:
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు. అనగా తెలుగు – హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషా వర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రవిడ భాషా వర్గమునకు చెందినదని భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో పాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి.
అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.