About the telugu Basha in easy in telugu
Answers
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు.
:--
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 7.4 కోట్ల (2011) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలోనూ, భారత దేశంలో హిందీ తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల (2020) మందికి మాతృభాషగా ఉంది. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వం గుర్తించింది.
వెనుజులకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతంన కలిగి) గా ఉండటం గమనించి తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించాడు. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించాడు. కన్నడ అక్షరమాల తెలుగు భాష లిపిని పోలిఉంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలిఉంటాయి.