India Languages, asked by yunus7703, 1 year ago

About Tulip flower in telugu

Answers

Answered by nanideepu
6
అందమైన పువ్వులతో అలరించే తులిప్ మొక్కలుతులిప అనే దుంప జాతికి చెందినవి. ఇందులో మొత్తం 109 రకాలు ఉన్నాయి. ఇవి లిలియేసికుటుంబానికి చెందినవి. వీటి మూలాలు దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని అనతోలియా, ఇరాన్, పశ్చిమ, ఈశాన్య చైనాలో విస్తరించాయి. పామిర్, హిందూ కుష్ పర్వత ప్రాంతాలు, కజకిస్తాన్లోనిగడ్డి మైదానాలు ఈ జాతిలోని భిన్నత్వానికి కేంద్రంగా నిలుస్తాయి. సాధారణ, సంకరణ తులిప్ లను తోటల్లో పెంచుతున్నారు. వీటిని పూలకుండీల్లో అమర్చుకుంటారు. అలంకరణకు కూడా వీటిని ఉపయోగిస్తారు. తులిప జేస్నెరియానా నుంచి వచ్చిన సంకరణ జాతులనే ఎక్కువగా పెంచుతున్నారు.
ఈ జాతి మొక్కల మూలం దుంపే. ఇవి నిత్యం దుపంతోనే ఉంటాయి. మొక్క మూలానికి చివర్లో ఈ చిన్న దుంపులు పుట్టుకొస్తాయి. కొన్ని చోట్ల వీటికి వేర్లు ఉండవు. మరికొన్ని చోట్ల వేర్లు ఉంటాయి. వీటిలో కొన్ని జాతులు పొట్టిగా ఉంటాయి. మరికొన్ని జాతులు పొడవుగా ఎదుగుతాయి. 10 నుంచి 70 సెంటీమీటర్లు(4-27 అంగుళాలు)ఎదుగుతాయి. ఇవి మంచుకురిసే చలికాలంలో కూడా బాగా ఎదుగుతాయి. ఈ మొక్కలకు సాధారణంగా 2 నుంచి 6 ఆకులు ఉంటాయి. కొన్ని జాతుల్లో 12 ఆకులు వరకు ఉంటాయి. ఆకులు కాండానికి అతికించిన పొడవైన పట్టీలా కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగులోని ఆకులు కాండానికి అటొకటి, ఇటొకటి ఉంటాయి. ఆకులు మందంగా ఉంటాయి. పొడుగ్గా, సన్నగా ఉంటాయి. పెద్ద పెద్ద పువ్వులు కాండానికే పూస్తాయి, సాధారణంగా మొటికేలని కలిగి ఉండవు. కాండానికి ఆకులు ఉండవు. కొన్నింటికి తక్కువ ఆకులు ఉంటాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మధ్య ఖాళీ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటికి ఖాళీ బాగా తక్కువగా ఉంటుంది. చాలా మటుకు ఒక కాండానికి ఒక పువ్వే పూస్తుంది. 
Similar questions