India Languages, asked by Rohith0007, 1 year ago

About Vivekananda in telugu

Answers

Answered by chandujadhav
6
స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగతత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

వివేకానంద

1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో - ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన మరియు పవిత్రమైనది, ఆలోచనకి మరియు నాణ్యత ప్రమాణాల పరిధి దాటినదైనదానికి నేను నమస్కరిస్తున్నాను "[1]

జననంనరేంద్రనాథ్ దత్తా
12 జనవరి 1863
కలకత్తా,బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం
(ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం)నిర్యాణము4 జూలై 1902 (aged 39)
బేలూరు మఠం, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం
(ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారత దేశం)జాతీయతభారతీయడుస్థాపించిన సంస్థబేలూరు మఠం, రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్గురువురామకృష్ణతత్వంవేదాంతసాహిత్య రచనలురాజయోగ, కర్మయోగ, భక్తియోగ మరియు జ్ఞానయోగప్రముఖ శిష్యు(లు)డుస్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత,స్వామి సదానంద

ప్రభావితులైన వారు

సుభాష్ చంద్ర బోస్, అరబిందో, భాగ జతిన్, మహాత్మా గాంధీ, చక్రవర్తి రాజగోపాలాచారి, జమ్సెట్జీ టాటా, నికోలా టెస్లా, సారా బెర్న్ హార్ట్ ,ఎమ్మా కాల్వె, జగదీశ్ చంద్ర బోస్

ఉల్లేఖన"లేండి, మేల్కొనండి మరియు గమ్యం చేరేదాక ఆగవద్దు"
(మరిన్ని పలుకులువికీఖోట్ లో చూడండి)సంతకం

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.



Rohith0007: tanku bro
chandujadhav: please mark as brainliest
chandujadhav: thanks you bro
Rohith0007: where r u from bri
Rohith0007: bro
chandujadhav: india bro
Similar questions