about voduvani muchata 100 line
Answers
Answer:
వొడువని ముచ్చట
సేత – ప్రొఫెసర్ జయశంకర్
వ్రాత - కొంపల్లి వెంకట్ గౌడ్
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇంటర్వ్యూలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలంగాణా చరిత్రలో ఒక కాన్సెప్ట్ కోసం పూర్తి జీవితాన్ని పణంగా పెట్టి పనిజేసిన సార్ (అందరూ ప్రొఫెసర్ జయశంకర్ గారిని అలానే పిలుచుకుంటారు) అనుభవాలు రికార్డ్ చేసి అందించారు వెంకట్ గౌడ్.
జయశంకర్ గారు విద్యార్థిగా, ఉద్యోగిగా, టీచరుగా, పదవిలో ఉన్నా లేకున్నా తెలంగాణ సమస్యతోనే జీవితం పెన వేసుకున్న స్వచ్ఛంద కార్యకర్త. ఆయనకు ఏ రాజకీయ పార్టీలతో గాని, వేదికలతో గానీ, వాటిల్లో సభ్యత్వం గానీ లేవు. తెలంగాణా గురించి ఎవరు పనిచేసినా వారితో మమేకమై పని చేసారు. తను తెలంగాణా సిద్ధాంత కర్తను కానని, మొదట ఇంగ్లీషు మీడియాలో తెలంగాణా ఐడియలాగ్ అని రాయడం మొదలు పెట్టారని, కాలక్రమంలో దాన్నే తెలుగు మీడియా 'సిద్ధాంతకర్త'గా అనువదించి ప్రాచుర్యం కల్పించిందని ఆయన వివరించారు.
ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఎలా రివైవ్ అయిందో ఈ పుస్తకంలో తెలియజేసారు సార్.
'తెలంగాణాలో ఏం జరుగుతోంది' అనే పుస్తకానికి వచ్చిన ప్రాచుర్యం ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని అంటారాయన.
అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ ఎలా ఏర్పడిందో సార్ వివరంగా చెప్పారు. దాని కోసం జయశంకర్ గారు అమెరికాలో విస్తృతంగా ప్రయాణించి ఎన్నో ఉపన్యాసాలిచ్చారు.
కెసీఆర్ తో తానెందుకు ఇంప్రెస్ అయ్యారో జయశంకర్ గారు చెబుతూ, కెసీఆర్ కాన్సెప్టులలో లోతుగా వెళ్ళి, విశ్లేషించి క్రిటికల్గా చర్చించేవారని అన్నారు. విషయ అవగాహన ఉండి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజల భాషలో నుడికారంలో తీసుకుపోయేటువంటి వ్యక్తి కెసీఆర్ అని సార్ భావించారు.
తెలంగాణవాదులని పరస్పరం కలవమని లక్ష్యం కోసం కలిసిపని చేయమని, అప్పుడే ఉద్యమం స్ట్రెన్తెన్ అవుతుందని జయశంకర్ చెప్పేవారు.
తనను ఎవరైనా విమర్శించినా, ప్రతి విమర్శ చేయనని చెబుతూ, "నాకు చేతనైంది చేస్తనయ్యా, తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు. ...కాలం నిర్ణయిస్తది... ఎవరి పాత్ర ఏంది" అని అంటారు.
ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు మూడు భాషలు తెలిసుండం తెలంగాణా కాంటెక్ట్స్లో చాల అవసరమని, తనకున్న అడ్వాంటేజ్ అదేనని సార్ అంటారు.
కళారూపాలు ఉద్యమంపై చూపిన ప్రభావం గురించి చెబుతూ, సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా కల్చరల్ డైమెన్షన్ రావడానికి, తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళారూపాలు ఎంతో దోహదం చేసాయని చెప్పారు.
తెలంగాణను తప్పకుండా జూస్తనని నమ్మిన వ్యక్తి జయశంకర్ గారు. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి కోసం అన్నీ సాధ్యమవుతాయని ఆయన నమ్మారు.
ఇప్పటి వరకు ఏ రచనలో రాని అనుభవాలను, జ్ఞాపకాలను రచయితతో పంచుకున్నారు సార్. అవి ఆయన భాషలోనే వస్తున్న పుస్తకం ఇది. ఇంకా ఎన్నో విషయాలు స్వయంగా జయశంకర్ గారు చెప్పినవి ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఇది జయశంకర్ గారి చివరి పుస్తకం. చారిత్రక, సాంస్కృతిక నేపధ్యంలో అతి ముఖ్యమైన పుస్తకం. ఆయన మనసు విప్పి ఎన్నో విషయాలు చెప్పారు ఈ పుస్తకంలో. ఓ రకంగా ఇది ఆయన ఆత్మకథ అని భావించవచ్చు
వొడువని ముచ్చట
సేత – ప్రొఫెసర్ జయశంకర్
వ్రాత - కొంపల్లి వెంకట్ గౌడ్
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇంటర్వ్యూలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలంగాణా చరిత్రలో ఒక కాన్సెప్ట్ కోసం పూర్తి జీవితాన్ని పణంగా పెట్టి పనిజేసిన సార్ (అందరూ ప్రొఫెసర్ జయశంకర్ గారిని అలానే పిలుచుకుంటారు) అనుభవాలు రికార్డ్ చేసి అందించారు వెంకట్ గౌడ్.
జయశంకర్ గారు విద్యార్థిగా, ఉద్యోగిగా, టీచరుగా, పదవిలో ఉన్నా లేకున్నా తెలంగాణ సమస్యతోనే జీవితం పెన వేసుకున్న స్వచ్ఛంద కార్యకర్త. ఆయనకు ఏ రాజకీయ పార్టీలతో గాని, వేదికలతో గానీ, వాటిల్లో సభ్యత్వం గానీ లేవు. తెలంగాణా గురించి ఎవరు పనిచేసినా వారితో మమేకమై పని చేసారు. తను తెలంగాణా సిద్ధాంత కర్తను కానని, మొదట ఇంగ్లీషు మీడియాలో తెలంగాణా ఐడియలాగ్ అని రాయడం మొదలు పెట్టారని, కాలక్రమంలో దాన్నే తెలుగు మీడియా 'సిద్ధాంతకర్త'గా అనువదించి ప్రాచుర్యం కల్పించిందని ఆయన వివరించారు.
ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఎలా రివైవ్ అయిందో ఈ పుస్తకంలో తెలియజేసారు సార్.
'తెలంగాణాలో ఏం జరుగుతోంది' అనే పుస్తకానికి వచ్చిన ప్రాచుర్యం ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని అంటారాయన.
అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ ఎలా ఏర్పడిందో సార్ వివరంగా చెప్పారు. దాని కోసం జయశంకర్ గారు అమెరికాలో విస్తృతంగా ప్రయాణించి ఎన్నో ఉపన్యాసాలిచ్చారు.
కెసీఆర్ తో తానెందుకు ఇంప్రెస్ అయ్యారో జయశంకర్ గారు చెబుతూ, కెసీఆర్ కాన్సెప్టులలో లోతుగా వెళ్ళి, విశ్లేషించి క్రిటికల్గా చర్చించేవారని అన్నారు. విషయ అవగాహన ఉండి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజల భాషలో నుడికారంలో తీసుకుపోయేటువంటి వ్యక్తి కెసీఆర్ అని సార్ భావించారు.
babli dm me in snap oka saari snap msg choodu friend request accept chey