About woodpeaker in telugu
Answers
Answered by
13
పిల్లలూ.. మీకు నల్ల వడ్రంగి పిట్ట గురించి తెలుసా? ఇవి ప్రమాదకర పక్షుల నుంచి తప్పించుకోవడానికి చెట్లలో తన గూటికి పెద్ద తలుపులు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఎక్కువగా యూరప్, స్పెయిన్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్, ఈశాన్య చైనా ప్రాంతాలలో కనపడతాయి. ప్రతిరోజూ ఎనిమిది వేల నుంచి 12 వేల సార్లు చెట్ల బెరడును తొలుస్తాయట. వీటి నాలుక పుర్రెకు చుట్టుకుని నోటి నుంచి కొంచెం బయటికి కనపడుతుంది. వీటి ముక్కు నేరుగా, సూదిలాగా, బలంగా, పసుపు రంగులో ఉంటుంది. నెత్తిన ఎరుపు రంగులోను, మిగతా శరీరమంతా నలుపు రంగులోనూ ఉంటాయి. దీని బరువు 12 ఔన్సులు. పొడవు 19 అంగుళాలు. రెక్కలు 27 అంగుళాలు. మార్చి - మే మధ్య కాలంలో గుడ్లు పెడతాయి. చెట్లపై కీటకాలు, పురుగులను తింటాయి.
Similar questions