India Languages, asked by tdileep, 1 year ago

Amma Nanna greatness poems

Answers

Answered by tawseeq56
2
తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న….కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అమ్మ….కాళ్ళ మీద నిలబడే వరకుకనుపాపలా కాపాడుతాడు నాన్న…

రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ….ఎంతటి కష్టాన్ని అయినా ఆనందంగా భరిస్తూ బిడ్డలకి సంతోషాన్ని పంచుతాడు నాన్న..   
తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ….అప్పు చేసి అయినా పిల్లల భవిష్యత్తు ని అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న…

ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ…మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న….

అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ….జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప….వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా…..ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా … ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దిన మాఅమ్మ,నాన్నలకి నా ఈ చిరు కానుక…జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటానని ….ఈ చిన్ని కవితని మా అమ్మ,నాన్నలకు మరియు అందరి తల్లితండ్రులకు అంకితం చేస్తూ….
Similar questions