మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం రాయండి. amswer only if u know
Answers
Explanation:
స్వచ్చ భారత్
బహిరంగ మల విసర్జన : ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఈగలు, పురుగుల ద్వారా విసర్జిత మలం నీటిలోనికి, ఆహారంలోకి చేరి తద్వారా నోటిలోనికి చేరి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. దీని వల్ల వచ్చే జబ్బులైన టైఫాయిడ్, కలరా, అతిసార, కామెర్లు వంటి వ్యాధుల్ని అరికట్టలేం. దీనికి ఏకైక పరిష్కారం వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం మాత్రమే. కేరళలో 40ఏళ్ల క్రితమే ప్రతి ఇంటికి సెప్టిక్ లెట్రిన్ అమరింది. అక్కడ బహిరంగ మలవిసర్జన లేదు. వ్యక్తిగత మరుగుదొడ్డి ఉన్న వాళ్లకు కూడా అది లేని వారితో ప్రమాదమే. అందుచేత నూటికి నూరుమంది మరుగుదొడ్లు ఉండాల్సిందే !
బహిరంగ మురుగుపారుదల వ్యవస్థ : పరిసరాల పరిశుభ్రతే మన తొలిప్రాధాన్యం కావాలి. బహిరంగ మురుగుపారుదల స్థానంలో మూసిన పారుదల అత్యవసరంగా ఏర్పడాలి. దీనికి వేలకోట్ల ఖర్చయ్యే మాట నిజమే. కానీ ప్రజల నుండి ఒత్తిడి వస్తే, పాలకులకుచిత్త శుద్ధి ఉంటే, వేలాది కోట్ల స్కామ్‌లను ఆపగలిగితే అసాధ్యం కానే కాదు. ప్రస్తుతం మాత్రం కనీసం మురుగుకాల్వలలో నీరు నిల్వఉండ కుండానైనా జాగ్రత్తలు తీసుకోవాలి. టీ కప్పులు, మంచినీళ్ల గ్లాసులు, విస్తర్లు మొదలైన ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు కాల్వలలో వేయకూడదు. ఇంకా దోమల నిర్మూలనకు చేపట్టాల్సిన కార్యక్రమాలు అన్ని ప్రారంభించాలి.
దివి xxx xxx
ఇట్లు ,
పట్టణ విద్యార్ధుల సంఘ0 ,
గుంటూరు