India Languages, asked by mrjatt3660, 11 months ago

An essay on summer vacation to visit to Meenakshi temple in Telugu

Answers

Answered by dreamrob
0

వేసవి విహార యాత్ర:

పోయిన సంవత్సరం వేసవి సెలవులలో నేను మా తల్లిదండ్రులతో కలిసి మీనాక్షి అమ్మవారి గుడిని దర్శించుకోవటానికి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళాము. చాలా పురాతనమైన అటువంటి మీనాక్షి అమ్మవారి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురై పట్టణంలో ఉంది.

తమిళనాడులోని మధుర మీనాక్షి టెంపుల్ చాలా పురాతనమైనది ఈ దేవాలయము వేగాయి నది ఒడ్డున ఉన్నది మేము మధురై పట్టణమునకు చేరుకోవడానికి మాకు రెండు రోజుల సమయం పట్టింది. మొదటి రోజు మేము అమ్మవారి దర్శనానికి దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ రథోత్సవం జరుగుచున్నది అక్కడ ఉన్న అందరూ అనుకున్నది ఏమనగా ఆరోజు మీనాక్షి కల్యాణం జరిగే రోజు ఈ ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన పండుగలలో ఇది కూడా ఒకటి అని అక్కడ ఉన్న వారందరూ అనుకుంటూ ఉండగా మేము వింటాము.

మధురై అమ్మవారి దేవాలయంలో నవరాత్రి శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు మీనాక్షి అమ్మవారి దేవాలయము 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయంలో మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం లో ఉన్నటువంటి దక్షిణ గోపురాన్ని 16వ శతాబ్దంలో చెట్టియార్ అనే రాజు నిర్మించాడని అక్కడి స్థల ప్రశస్తి.

మీనాక్షి అమ్మవారి దేవాలయము మన భారతీయ సంస్కృతికి చరిత్ర ఒక గొప్ప నిదర్శనంగా అభివర్ణించవచ్చు. అద్భుతమైన శిల్ప చిత్రకళా రీతులతో వున్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి ఒక గొప్ప చిహ్నం గా భావించవచ్చు. నేను మా తల్లిదండ్రులతో కలిసి గుడిలోనికి గుడి సంప్రదాయం ప్రకారం మొదటగా తూర్పు వైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా ఆలయ చేరుకున్నాము ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని కల్యాణంలో పాల్గొని తిరిగి బయటికి వచ్చేశాను అమ్మవారి దేవాలయంలో ఉన్నంతసేపు మాకు చాలా ప్రశాంతంగా మనసు హాయిగా అనిపించింది.

రెండవ రోజు తమిళనాడు లో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలను సందర్శించుకునే తిరిగి మా ఊరికి ప్రయాణమై వచ్చేశాము ఈ మూడు రోజుల విహారయాత్ర నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

Similar questions