answer all............ ....
Answers
ఎవరి భాష వాళ్ళకు వినసొంపు
ఏ ప్రాంతం వాళ్ల తెలుగు ఆ ప్రాంతం వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది.
పాత నీరుపోయి, కొత్తనీరు వస్తున్నట్లుగా భాష నిరంతరం మారుతూ ఉంటుంది. అది సహజలక్షణం. అదే సజీవ లక్షణం.
అలాగే ప్రాంతాన్ని బట్టి భాష, యాస మారుతూ ఉంటుంది. ఇది క్రియారూపాల్లోనే కాక నామవాచకాల్లో, సంబోధనల్లో,
మర్యాదల్లోనూ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఒక ప్రాంతంలోని మనుషుల జీవన విధానం, వ్యవహార శైలి, పాలకుల
విధానం, పరిసర భాష ప్రభావం, అక్కడ ఉత్పత్తులు, వనరుల వినియోగం తదితరాంశాలు భాష స్వరూప స్వభావాలను
నిర్ణయిస్తాయి. (ఉదా|| సముద్రతీర ప్రాంతవాసులకు అక్కడ లభించే చేపలు, చేపలుపట్టే సాధనాలు, చేపలు
వండటంలోని విధానాలు, సముద్రపు ఆటుపోటులు మొదలైన అనేక అంశాలు భాషలో భాగమైపోతాయి. అవి మిగతా
వ్యవ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. సముద్రాలకు దూరంగా కొండల్లో నివాసముండే వాళ్లకు అక్కడ దొరికే కాయలు,
పండ్లు, నీటి ఎద్దడితో ఎదుర్కునే ఇబ్బందులు, వస్త్రధారణ, ఆహార వ్యవహారాలు వాళ్ల భాషలో అంతర్లీనమై
నిత్యవ్యవహారంలోనూ భిన్నత్వాన్ని చూపిస్తాయి కదా!) అదే విధంగా ప్రతి పదిమైళ్లకు భాషలో భేదం ఉంటుంది. భాష
పరమార్ధం భావవినిమయమే కాబట్టి ఎక్కడి ప్రాంతం వాళ్లు అక్కడ మాట్లాడే భాషకు బాగా అలవాటు పడతారు.
చెవులకింపుగా, హృదయాన్ని తాకేటట్లుగా ఉండే ఆ భాష వాళ్ల రక్తంలో రక్తమై విడదీయరాని గాఢానుబంధాన్ని
ఏర్పరుస్తుంది. అందుకే భాష తల్లివంటిదని 'మాతృభాష' అని గౌరవిస్తూ ఆత్మీయానందాన్ని అనుభవిస్తుంటాం. ఎవని
కంపు వానికింపు'అన్నట్లు మనదైన భాష మనకు ఇంపూ, సొంపు. తద్భిన్నమైన అలవాటులో లేని భాష విన్నప్పుడు
అసౌకర్యంగానే కాక విచిత్రంగా అనిపిస్తుంది. అది రుచించదు. (అలవాటైతే అది కూడా బాగుంటుంది) అందుకే ఎవరి
భాష వాళ్లకు చాలా బాగ అనిపిస్తుంది.
Answer:
Chudu ela unnai mi antha artist naithe kadu