anthyanuprasa alankaram examples
in telugu please
don't spam
Answers
Answer:
అలంకారము : కావ్యమునకు అందమును చేకూర్చే దాన్ని అలంకారము అంటారు.
అలంకారములు మూడు రకములు. అవి:
శబ్దాలంకారములు: శబ్దం ప్రధానముగా కవితకు బాహ్యసౌందర్యమును కలిగించేవి శబ్దాలంకారములు.
అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అంతఃసౌదర్యమును కలిగించేవి అర్థాలంకారములు.
ఉభయాలంకారములు: శభ్దార్థాల రెంటి వలన కవితకు అందమును సమకూర్చేవాటిని ఉభయములు అంటారు.
అంత్యానుప్రాసము:-
పద్యములోని పాదాలకు కాని, వాక్యములకు కాని చివరిభాగములో ప్రాస కలుగునట్లు అవే అక్షరములు మరల మరల చెప్పుటను అంత్యానుప్రాసము అని అంటారు.
ఉదా:- అగ్గిపుల్ల
కుక్కపిల్ల
సబ్బుబిళ్ళ
కాదేది కవితకనర్హం
ఔనౌను శిల్పమనర్ఘం
ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై