any 5 Telugu language janapada geyalu
plzzzzzzzz
Answers
ఎలమంద సాంగ్ (తెలుగు)
మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద...
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద... (2)
అన్గిలేనివోట్టి పై గొంగలేసుకుండు,
అడ్డపంచెను బుడ్డ గోసిగ కట్టిండు,
కిర్రు తోలు జోళ్ళు కాళ్ళకు తోడిగిండు.....(కిర్రు తోలు/2/)
కందిజొన్న కోయ ఎలమంద, కౌంజు పిట్టవలె పోతుండు ఎలమంద
వేలెడంత లేదు ఎలమంద, వేయి మందకే వస్తాదు ఎలమంద..ఆ..(మందేంట పోతండే/2/)
ఎక్కరాని తుమ్మలెక్కి నరుకుతాడు,
ఎత్తైన గుట్టలెల్ల తిరుగుతాడు
వాగుల వంకల రాగాలు తీస్తాడు.....(వాగుల/2/)
చెరువు గట్టున నిలిచి ఎలమంద చందమామోలె నవుతాడు ఎలమంద
తుమ్మనీడ ఉంటె ఎలమంద అమ్మావొడిని మరుసుతాడే ఎలమంద.....(మందేంట పోతండే/2/)
మూతికి జానెడు మోదుగ సుట్టను
సేతి సద్దున పెట్టి గుప్పున గుంజేటి
తండ్రిసెప్పిన మాట గీత దాటిపోడు.....(తండ్రిసెప్పిన /2/)
పిర్ర గిల్లంగనే ఎలమంద వాడు టిర్రుమంటడమ్మ ఎలమంద
వీడు కూత పెట్టంగనే ఎలమంద వేట తోడేళ్ళు పరారు ఎలమంద.....(మందేంట పోతండే/2/)
తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దగ్గిన
ముల్లుకొట్టి గొర్రె కాలిడ్చిన గాని
తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు....(తట్టుకోడు/2/)
కొట్టకులోట్టకు ఎలమంద చెట్టు నూరి కట్టుతాడే ఎలమంద
యాడ నేర్చిన విద్య ఎలమంద,గొల్ల కురమవాడ విద్య ఎలమంద.....(మందేంట పోతండే/2/)
యడాదికోసారి గోర్లేల్లి పోతుంటే...
తోడుగున్న గొర్లు యాడికిపొతున్నయని తల్లినడుగుతాడు తండ్రినడుగుతాడు
గొర్ల కటికివనికమ్మ ఎలమంద కండ్ల నీళ్ళు పెడతాడమ్మ ఎలమంద
గొర్లు తరలిపోతువుంటే ఎలమంద వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద(వాడు గోల్లుమంటడమ్మ..)...ఓ..
అమ్మ బయలెల్లినాదో................ అమ్మ తల్లి బయలెల్లినాదో............. అమ్మ తల్లి బయలెల్లినాదో.............
అమ్మ బయలెల్లినాదో నాయన.....తల్లి బయలెల్లినాదో..//అమ్మ//
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మ....//లస్కరు//
అమ్మ బయలెల్లినాదో నాయన.....తల్లి బయలెల్లినాదో...//అమ్మ//
పోతరాజులేగురంగా.......అమ్మ మంకాళీ
శివసత్తులుగంగా... తల్లి మంకాళీ
లస్కరులో బోనాలు... అమ్మ మంకాళీ
డప్పులతో జనాలు... తల్లి మంకాళీ
లస్కరులో బోనాలు డప్పులతో జనంతో...
అమ్మ బయలెల్లినాదో నాయనా.....తల్లి బయలెల్లినాదో....//అమ్మ//
పోరగాన్లు, పోట్టెగాన్లు.... అమ్మ మంకాళీ
తీనుమారు ఆడుకుంటా... తల్లి మంకాళీ
చారుమీనారుకాడ.... అమ్మ మంకాళీ ...
గల్లి గల్లి లొల్లి లొల్లి... తల్లి మంకాళీ
చారుమీనారుకాడ గల్లి గల్లి లొల్లి లొల్లి........హ
అమ్మ బయలెల్లినాదో నాయనా.....తల్లి బయలెల్లినాదో... //అమ్మ//
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మో....//లస్కరు//
కల్లు సాగ కోడి పుంజు... అమ్మ మంకాళీ
కొత్త సీరా కొత్త రవిక...తల్లీ మంకాళీ
సంకపిల్ల నెత్తుకోని... అమ్మ మంకాళీ
నిన్ను సూడ వత్తునమ్మ... తల్లీ మంకాళీ
సంకపిల్ల నెత్తుకోని...నిన్ను సూడ వత్తునమ్మ
అమ్మ బయలెల్లినాదో నాయనా.....తల్లి బయలెల్లినాదో... //అమ్మ//
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మో....//లస్కరు//
అమ్మమ్మో మాయమ్మో.......ఓ...అమ్మమ్మో మాయమ్మో... తల్లీ మంకాలమ్మో
మా పిల్ల పాపలనమ్మో...మాయమ్మ
సల్లంగా దీవించమ్మో.....//మా పిల్ల//
మా పిల్ల పాపలనమ్మో...మాయమ్మ..
సల్లంగా దీవించమ్మో.....//మా పిల్ల//
లస్కరు బోనలమ్మో....మా యమ్మ కదలొచ్చే మంకాలమ్మ.....
లస్కరు బోనలమ్మో....మా యమ్మ కదలొచ్చే మంకాలమ్మ.....
............................................................................................................................................
..................................జానపదాలు పాడుకుందాం....జాతిని కాపాడుకుందాం.....................................
........................................................ధన్యవాదాలు...................................................................
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు...
వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో.....
నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును...
వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో.....
నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన...
పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో.....
పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన...
అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో.....
ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి...
దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో.....
నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు...
నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో.....
ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి//
......................................................................................................................................
..........జానపదాలను ఆదరిద్దం...........జాతిని కాపాడుకుందాం.....................................
........................................................ధన్యవాదాలు..........................................................