India Languages, asked by bindureddy1074, 1 year ago

arogyama mahaballamu essay in telugu

Answers

Answered by kvnmurty
7
    మన తెలుగు లో ఎన్నో సామెతలున్నాయి. ఆ ఆన్నింటిలో రెండు అతి ముఖ్యమైనవి.  మనకు నిత్యమూ చాలా ఉపయోగపడేవి.  అవి, ఆరోగ్యమే మహా భాగ్యము  మరియు  ఆరోగ్యమే మహాబలము. ఈ  రెండింటి అర్ధం ఇంచు మించు ఒకటే.

   ఆరోగ్యమన్నది మన జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణం అతి ముఖ్యం.  ఏ వ్యక్తి అయినా కూడా ఒక రోజు శారీరికంగా రోగపీడితుడైతే అపుడు ఎంతో బాధను అనుభవిస్తాడు.  ఏ పని సక్రమంగా  చేయలేడు. శ్వాస పీల్చుకోవడం కూడా కష్టం, బాధలు కలిగించొచ్చు.  అశాంతి, నిద్రలేమి, ఆందోళన, ఇతరుల నిరాదరణ, ఇతరులు పట్టించుకోకపోవడం, మన పనులు సక్రమంగా జరగక పోవడం, ఆశలు కొన్ని నెరవేరకవడం ఇవన్నీ జరగొచ్చు

   కానీ  ఆరోగ్యం గా  ఉన్నప్పుడు అన్నీ మనం అనుకొన్నట్లు అంచనాల ప్రకారం  జరుగుతాయి. మనం నవ్వవచ్చు, రుచికరమైన భోజనం తినొచ్చు, హాయిగా నిదురోవచ్చు ఇంకా ఎన్నో చేయచ్చు.

   ఆరోగ్యంగా ఉన్నోప్పుడు మనం ఎంతో బలంగా ఉంటాం.  కాని ఆ బలం శరీరానిది కాదు.  శరీరానికి  ఉన్నఆరోగ్యానిది. ఆరోగ్యం గా ఉన్నప్పుడు మన మెదడు, అవయవాలు బలంగా ఉంటాయి. అనారోగ్యం వల్ల వాటి బలం అంతా పోతుంది.  ఏనుగు పులి కూడా ఎవరినీ ఏమీ చేయలేవు.

   అందుకనే ఆరోగ్యమే మహాబలము , మహాభాగ్యము. 

    ఆరోగ్యానిని రక్షించుకోవాలంటే మనం నిత్యం యోగా చేయాలి.  నడవాలి.  శారీరిక శ్రమ తప్పని సరి. వ్యాయామం  అనివార్యం.  సరైన సమయంలో  భోజనం చేయడం, నిద్ర పోవడం, సరి అయిన పౌష్టిక ఆహారం తీసుకోవడం,  వాతావరణాన్ని బట్టి మనలను మనం కాపాడుకోవడం చేయాలి.  శుచి శుభ్రతలు చాలా అవసరం. 


kvnmurty: :-)
Answered by marydavarapalli123
0

Answer:

super its really nice thankyou

Similar questions