Balakarmika vyavshta in telugu essay
Answers
Explanation:
ప్రపంచ వ్యాప్తంగా 2000 నాటికి 246 మిలియన్ల మంది బాలకార్మికులు ఉంటే 2012 ముగిసేనాటికి 168 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం బాలబాలికల జనాభాలో 11 శాతం మంది బాలకార్మికులే.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 77.7 మిలియన్ల మంది బాలకార్మికులున్నారు. సబ్ సహారన్ ఆఫ్రికాలో 59 మిలియన్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో 12.5 మిలియన్లు, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో 9.2 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారు.
పేద దేశాల్లో బాలకార్మికులుగా మారుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే జనాభా పరంగా చూస్తే అత్యధిక శాతం మధ్య ప్రాచ్యంలో ఉన్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బాలకార్మికుల సంఖ్య భారీగా ఉంది. అయితే సబ్ సహారన్ ప్రాంతంలో బాలకార్మిక జాబితాలో చేరుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సబ్ సహారన్ ఆఫ్రికాలో ప్రతీ ఐదుగురు బాలబాలికల్లో ఒకరి కంటే ఎక్కువ మంది బాలకార్మికులుగా ఉంటున్నారు.
గత 12 ఏళ్లలో 78 మిలియన్ల మంది బాలకార్మికులు తగ్గారు. ముఖ్యంగా బాలికల్లో తగ్గుదల భారీగా నమోదైంది. 40 శాతం వరకు బాలికలు, 25 శాతం మంది బాలురు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు.