Bandari basavanna swabavam gurnchi rayandi
Answers
Explanation:
Basavanna was an Indian 12th-century Statesman, philosopher, poet, Lingayat saint in the Shiva-focussed Bhakti movement, and social reformer during the reign of the Kalyani Chalukya/Kalachuri dynasty. Basavanna was active during the rule of both dynasties but reached his peak of influence during the rule of King Bijjala II in Karnataka, India .
. translation in telugu. hope this helps u pls mark me as brainlist ✌️
బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు
కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు. దేవుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, దేవుడు ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు.