India Languages, asked by niravadya05, 1 year ago

can anyone write telugu poems on vidya (chaduvu)

Answers

Answered by snehitha2
18
★విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

★చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

★చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి నీ జీవితానికి వస్తుంది కొత్త వెలుగు.

★చదువుజదువుకున్న సౌఖ్యంబులునులేవు
చదువుజదివెనేని సరసుడగును
చదువుమర్మమెరిగి చదువంగచూడుము
విశ్వదాభిరామ వినురవేమ!

★చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్
బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

Hope it helps
Answered by koppurevanth999
11

విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.

విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. సలకుల చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం.

Similar questions