English, asked by saibaba55, 7 months ago

can you say
in telugu 4 to 5 points of flag

this is telugu subject​

Answers

Answered by raotd
2

Answer:భారత జాతీయపతాకం

భారత జాతీయపతాకం జండా నిష్పత్తి:

భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు. భారతదేశంలో తిరంగా (హిందీ: तिरंगा) లేక ట్రైకలర్ (English: Tri-color) అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి. పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా[N 1] 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం.

చట్టప్రకారం జెండా ఖద్దరుతో తయారుచేయాలి. జాతీయోద్యమానికి, స్వరాజ్య పోరాటానికి సంకేతంగా మహాత్మా గాంధీ ఖద్దరును ఉపయోగించడం దీనికి కారణం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పతాకాన్ని తయారుచేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించింది. పతాకాన్ని తయారుచేయడానికి ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌కే హక్కు ఉంది. ఈ కమీషన్‌ ఇతర స్థానిక గ్రూపులకు తయారీ అప్పగించిస్తుంది. 2009 నాటికి పతాకం ఏకైక తయారీదారుగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం ఉంది.

భారత జెండా కోడ్‌, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇతర చట్టాలు జెండా వాడుకకు వర్తిస్తాయి. మొదట్లో ఈ కోడ్ భారత స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది. 2002లో నవీన్ జిందాల్ అభ్యర్థన పరిశీలిస్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సాధారణ పౌరులు జెండాను వాడుకునేందుకు వీలుగా కోడ్‌ను సవరించమని భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దాన్ని అనుసరించి భారతీయ కేంద్ర మంత్రివర్గం కోడ్‌ను పరిమితంగా వాడేందుకు సాధారణ పౌరులకు వీలునిస్తూ సవరించింది. 2005లో మరోసారి కోడ్‌ను సవరించి కొన్ని రకాల దుస్తుల మీద ఉపయోగించడం సహా మరికొన్ని అదనపు వాడుకలను అనుమతించారు. జెండాను ఎగురవేయడం, ఇతర జాతీయ, సాధారణ జెండాలతో కలిపి భారత జాతీయ పతాకాన్ని వాడేప్పుడు అనుసరించాల్సిన విధానాలకు ఆ కోడ్ వర్తిస్తుంది.

Explanation:Follow me

Similar questions