India Languages, asked by anugudduaahna, 1 year ago

Cheruvula pramukyatha emiti?

Answers

Answered by kvnmurty
122
      చెరువులు ఒక లోతైన ప్రదేశంలో వాన నీరు పడడం వల్ల కాని, భూమి లోపలినుండి అంతర్జలం బయటకు పొరలు దాటుకొని వచ్చి చేరుతుంది.  కొన్ని చెరువులు ప్రభుత్వమో, రాజులో త్రవ్వించారు.  చెరువుల వల్లన వ్యవసాయానికి నీరు దొరుకుతుంది.  కొన్ని గ్రామాలకు చెరువు లో నీరే మంచినీరు. అవే త్రాగుతారు.

 

    కొన్ని చెరువులలో ఊరి ప్రజలందరూ స్నానం చేస్తారు. కొన్ని సంవత్సరాల క్రిందటైతే అందరూ చెరువుల మీదే ఆధార పడ్డారు.  బట్టలుతికే చాకలివాళ్లు కూడా చెరువుల వద్దనే బట్టలుతికేవాళ్ళు.  చెరువులోని నీరు పక్షులకు, అన్నీ పశువులకి త్రాగడానికి, స్నానం చేయడానికి, శరీరం చల్లబరచడానికి ఉపయోగ పడుతుంది.

 

    చెరువుల వల్లన చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి.  చుట్టుప్రక్కల ఈకోసిస్టెమ్ చెరువు పైన ఆధారపడుతుంది.  వలస పక్షులు చెరువుల వద్దనే ఉంటాయి. చెరువులలో చేపలు ఇంకా ఇతర జల జంతువుల పెంపకం వ్యాపారం చేసుకోవచ్చు.  చెరువుల దగ్గర్ భూమి సారవంతంగా ఉంటుంది.  చెరువులలో చాలామంది ఈత కూడా నేర్చుకొంటారు.  చెరువులు పల్లెటూళ్ళకు ఒక గుర్తింపు తెస్తాయి. చెరువుల వద్దన చాలామంది సమావేశం కూడా అవుతారు. వాతావరణం బాగుంటుంది కదా అక్కడ.

 

   చెరువులు జల సంరక్షణ కు పనికొస్తాయి.  అది అన్నిటికన్నా ముఖ్యం.


kvnmurty: clik on thanks. select best ans
Answered by 9948198579
20

Answer:నదులు నీరు మరియు పోషకాలను భూమి చుట్టూ ఉన్న ప్రాంతాలకు తీసుకువెళతాయి. నీటి చక్రంలో ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఉపరితల నీటికి పారుదల మార్గాలుగా పనిచేస్తాయి. భూమి యొక్క ఉపరితల ఉపరితలంలో దాదాపు 75% నదులు ప్రవహిస్తాయి. నదులు భూమి యొక్క అనేక జీవులకు అద్భుతమైన ఆవాసాలు మరియు ఆహారాన్ని అందిస్తాయి.

Explanation:

Similar questions