children's day speech in telugu
Answers
హాయ్.. పిల్లలూ.. ముందుగా మీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే..! చిల్డన్స్ డే సందర్భంగా మనం కొన్ని విషయాలు తెల్సుకుందాం..!పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈ విషయాన్ని స్వయంగా చాచాజీ (నెహ్రూ పిల్లలు ముద్దుగా పిలుచుకునే పేరు)నే చెప్పారు. నవంబర్ 14వ తేదీని నా జన్మదినంగా గుర్తించవద్దనీ, ఆ రోజును "బాలల దినోత్సవం"గా గుర్తించాలని చాచాజీ చెప్పారు. అందుకే మనం చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం.
బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పిన మహానుభావుడు మన జవహర్ లాల్ నెహ్రూ..! ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే దిశగా పాఠశాలలు పది రోజుల ముందు నుంచే ఈ వేడులను నిర్వహిస్తుంటారు. స్కూళ్లల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో ఆడి, పాడించడం, వ్యాస రచన, వకృత్వ పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది.
నేటి బాలలే రేపటి పౌరులు. మనదేశ భవితవ్యం బాలల మీద ఆధారపడి వుంది. వీరే గనుక సరైన మార్గంలో పయనిస్తే మన దేశ కీర్తి పతాకాపు రెపరెపలు ప్రపంచానికి కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యున్నత స్థానం మనకు లభిస్తుంది. అలా కాకుండా.. చెడు అలవాట్లతో, పెడ తోవలో పయనిస్తే.. వారి మనుగడకు ముప్పు తెచ్చుకున్న వారే కాకుండా.. దేశపు కీర్తి ప్రతిష్టలను నాశనం చేసినవారు అవుతారు. ఈ సత్యాన్ని గ్రహించిన వారిలో ప్రప్రధమ వ్యక్తి మన చాచాజీ.
మరి నేటి బాలలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది..? ముదుగా.. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఆ బాద్యత ఉంటుంది. అనంతరం విద్యాబుద్దులు నేర్పే గురువు మీద ఉంటుంది. వీరు పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దితే దేశం అన్ని విధాలుగా బలపడి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించని వాళ్లకు ఈ బాలల దినోత్సవం కనువిప్పు కలిగిస్తుంది.
hope this helps you
Answer:
బాలల దినోత్సవం సందర్భంగా ప్రసంగం ఇలా ఉంది:
Explanation:
బాలల దినోత్సవం
బాలల దినోత్సవ ప్రసంగం - నవంబర్ మధ్యలో మనకు చాలా ప్రత్యేకమైన సందర్భం. ప్రతి సంవత్సరం నవంబర్ 14ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. మన మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు కాబట్టి మేము దీనిని జరుపుకుంటాము. పిల్లలతో అతని బంధం మరియు అభిమానం పురాణగాథ. ఆయన జన్మదినాన్ని పాఠశాలలో, ఇంట్లో, విద్యాసంస్థలలో మరియు కుటుంబాలలో బాలల దినోత్సవంగా జరుపుకోవడం చాచా నెహ్రూ జ్ఞాపకశక్తిని మరియు దార్శనికతను గౌరవించే మార్గం. మన దేశపు పిల్లల ఆత్రుత మరియు ఆశయాల వల్లనే మనం భారతీయ సమాజానికి అర్హమైన కీర్తిని సాధించగలిగాము.పాఠశాలలు మరియు సంస్థలలో సరదాగా ఉండే రోజు, చాలా పాఠశాలలు పిల్లలకు అనేక వినోద కార్యక్రమాలు మరియు ఉత్తేజకరమైన పోటీలను నిర్వహిస్తాయి. అయితే, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవించిన ఆలోచనలు మరియు విలువల ప్రతిబింబం లేకుండా రోజు అసంపూర్ణంగా ఉంటుంది.అతను చాలా అదృష్ట నేపథ్యం నుండి వచ్చాడు కానీ అది అతని వైఖరిని ప్రభావితం చేయలేదు. అలాగే, అతని కుటుంబ సంపద బ్రిటీష్ ఇండియాలో అతనికి గౌరవప్రదమైన స్థానం కల్పించడానికి సరిపోతుంది. అయినప్పటికీ, అతను మహాత్మా గాంధీ పక్షాన ఉండటాన్ని ఎంచుకున్నాడు మరియు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన భాగమయ్యాడు.
#SPJ3