India Languages, asked by VarshaVarsitha, 2 months ago

శ్రీ రాముడి పాత్ర స్వాబావం రాయండి. correct answer will get marked as brainliest answer please no spam very important​

Answers

Answered by nk9
3

Answer:

శ్రీరాముడు ఇక్ష్వాకు వంశ రాజైన దశరథునికి - కౌసల్యకు జన్మించాడు. సర్వ శుభలక్షణాలు గలవాడు. రామోవిగ్రహవాన్ ధర్మ: అని లోకోక్తి, విశ్వామిత్రుని వల్ల అస్త్రప్రయోగం నేర్చి రాక్షస సంహారం చేశాడు. శివధనస్సు విరిచి లోక కీర్తిని పొంది సీతని పెళ్ళాడాడు. తండ్రి మాటను పాటించి వనవాసానికి వెళ్ళాడు. అనేక మంది మునులను దర్శించి వారి వల్ల శక్తివంతుడు అయ్యాడు. మునులకు కష్టం కలిగించిన రాక్షసులను సంహరించాడు. ఏకపత్నీ వ్రతాన్ని పాటించాడు. భార్యని వెదకుతూ సుగ్రీవుని తో స్నేహం చేసి వాలిని చంపాడు. హనుమంతుని ద్వారా సీత జాడ గ్రహించాడు. వానరుల సాయంతో వారధి నిర్మించి లంక చేరాడు. భీకర యుద్ధంలో రావణుని వంశ నిర్మూలన చేశాడు. మానవుడు తన గుణసంపదతో దైవత్వం పొందగలడని నిరూపించాడు. కుటుంబ రాజక, వాత్సల్య విషయాల్లో ఆదర్శమూర్తిగా నిలిచాడు.

Answered by xXItzSujithaXx34
16

వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి.

భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపధ గాథల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.[1] ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి పంబన్ వ్రాసిన పంబ రామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసము.[2]

తెలుగులో లెక్క పెట్టడం కష్టమైనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణము; గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము; భాస్కరుడు రచించిన భాస్కర రామాయణము; విశ్వనాధ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షము.

రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. అగ్నేయాసియాలో అనేక జానపద గాథలు, కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాథలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. జావా దీవి (ఇండొనీషియా) లోని కాకవిన్ రామాయణ, బాలి దీవిలోని రామకవచ, మలేషియాలోని హికయత్ సెరి రామ (Hikayat Seri Rama), ఫిలిప్పీన్స్లోని మరదియా లవన (Maradia Lawana), థాయిలాండ్‌లోని రామకీన్ - ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.బ్యాంగ్‌కాక్ నగరంలోని వాట్ ఫ్రా కేవ్ మందిరంలో రామాయణ గాథకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడిఇఉన్నాయి. మయన్మార్ దేశపు జాతీయ ఇతిహాసం యమ జత్‌దా కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కథలో రాముని పేరు యమ. కంబోడియాలోని రీమ్‌కర్ లో రాముని పేరు ఫ్రీ రీమ్ (Preah Ream). లావోస్కు చెందిన ప్ర లక్ ప్రా లామ్ కథలో రాముని అవతారమే గౌతమ బుద్ధుడు అని చెప్పబడింది.

Similar questions