danashinamu
పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
Answers
సమాధానం:
బలిచక్రవర్తి దగ్గరకు వచ్చిన వామనుడి గురించి తెలుసుకున్న శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ''వచ్చిన పొట్టివాడు విష్ణువు. నీవు ఇచ్చే కొంచెం దానం మాత్రమే తీసుకుని వెళ్లేవాడు కాదు. మూడు అడుగుల నేలతో మూడు లోకాలను ఆవరించి గొప్ప రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్ని నిలుపుకో, దానం గీనం ఏమీవద్దు ఈ వామనుడిని పంపించు" అన్నాడు.
ఆ మాటలు విని గురువైన శుక్రాచార్యుడితో ''మీరు చెప్పింది నిజమే ఇది లోకంలో గృహస్థుల ధర్మం. ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. ఆచార్యా! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ సంపదను మూటగట్టుకుని పోలేదు. వారి పేర్లు కూడా మిగల్లేదు. విష్ణువు అంతటివాడు చిన్నవాడిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే నాలాంటి వాడికి ఇంకేం కావాలి" అన్నాడు.
'అంతేకాదు మరణం వచ్చినా, నరకం వచ్చినా, నా వంశం నశించినా ఏమైనాకానీ ఆడిన మాట మాత్రం తప్పను' అని పలుకుతున్న సందర్భంలో బలిచక్రవర్తి తన భార్యయైన వింధ్యావళికి నీళ్లు తెమ్మని సైగ చేశాడు. ఆమె శ్రేష్ఠమైన బంగారు కలశంతో కాళ్లు కడిగేందుకు నీళ్లు తెచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి వామనుడితో 'ఓ ఉత్తమ బ్రహ్మచారీ! ఇటురా నీవు అడిగింది లేదనకుండా ఇస్తాను నీ పాదాలు ఇటు పెట్టు' అని అడిగి కాళ్లు కడిగి ఆ పవిత్ర జలాన్ని నెత్తిపై చల్లుకున్నాడు.
బలిచక్రవర్తి చేతులు చాచి వామనుడిని పూజించాడు. 'బ్రాహ్మణుడవూ ప్రసిద్ధమైన వ్రతము గలవాడవు. విష్ణు స్వరూపుడవైన నీకు మూడు అడుగుల నేలను దానం చేస్తున్నాను'. అని బలిచక్రవర్తి వామనుడితో పలికి ''పరమాత్మనకు ప్రీతి కలుగుగాక" అంటూ వామనుడి చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది.
బలిచక్రవర్తి దానం ఇవ్వగానే పది దిక్కులు, పంచభూతాలు ''బళి బళి" అని పొగిడాయి.
.
.
.
.
ధన్యవాదాలు(◕ᴗ◕✿)