demonetisation in telugu language
Answers
Demonetization (డీమోనెటైజేషన్)
అంటే విముద్రీకరణము. మన భారత దేశంలో ప్రభుత్వం ఎన్నోసార్లు
విముద్రీకరణాన్ని అమలు చేసింది. ఇటీవల నవంబరు 8, 2016 న కూడా దేశ
ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ప్రకటించారు. ఆ అర్ధరాత్రి నుంచి వెయ్యి
మరియు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేశారు.
దీని ముఖ్య ఉద్దేశ్యం దేశం లోని నల్ల ధనాన్ని బయటకు లాగడమే. బోగస్
వ్యాపారాలని,
బెనామీ
హవాలా వ్యవహారాలని కట్టు దిట్టం చేయడమే. అందరూ తమ తమ దగ్గరున్న 500 , 1000 రూ. కాగితాలని తమ బ్యాంక్
లలో జమచేయాలి. అలా చేయడానికి రెండు నెలల సమయం ఇచ్చారు. రెండున్నర లక్షల కంటే ఎక్కువ కాష్ తమ దగ్గరుంటే దానికి
కారణం చెప్పాలి.
ఇందువల్ల చాలామంది బీద ప్రజలకి ఇబ్బంది కలిగింది. వ్యాపారాలకు
ఎద్దడి తగ్గింది. లాభాలు తగ్గాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి. చాలామంది వ్యాపారులు తమ వ్యాపారాలు మూసివేశారు.
ప్రజల దగ్గర కొత్త 2000 నోట్లు , పాత 100 రూ. నోట్లు , చిల్లర లేక వస్తువులు కొనడానికి ఇబ్బంది పడ్డారు. బాంకుల వద్ద
గంటల
తరబడి
క్యూ లైన్లో నుంచొని కష్ట పడ్డారు.
కాని ఈ విముద్రీకరణం వల్ల ఎంతో నల్ల ధనం బయటకు వచ్చింది. ప్రభుత్వానికి
పన్ను కట్టని ఎంతోమందిని పట్టుకోవడం జరిగింది. తరువాత
జరిగిన ఎన్నికల లో నల్ల ధనం ప్రభావం తక్కువ గా కనిపించింది. కానీ దేశ ప్రగతి లోను, ఆర్ధిక
స్థితిలో ను కొంత తరుగుదల కనిపించింది.
పాకిస్తాన్ నుండి దొంగ నోట్లు ఎన్నో వేలకోట్లు భారత దేశం లోకి వస్తుండేవి. అవి ఇప్పుడు ఆగాయి. ఆ డబ్బు దేశంలోని ఉగ్రవాదులకు ఉపయోగపడకుండా మంచి జరిగింది. ప్రతి పక్షాలు అన్నీ ఈ విముద్రికరణాన్ని పార్లమెంట్ సభలలో ను బయట వ్యతిరేకించాయి. కానీ ప్రభుత్వం తన నీతి న్యాయం పక్షాన్ని వదలలేదు.
ఎంతోమంది ఆ తరువాత బాంకులలో ఖాతా తెరిచారు. ఇంటర్నెట్ లో వస్తువులు కొనడం అమ్మడం మొదలు పెట్టారు. ఆన్ లైన్ వ్యవహారాలు పెరిగాయి. అందువల్ల పన్నులు ఎగవేయడం తగ్గింది. ఇదంతా మనకు మూడు నాలుగు సంవత్సరాల తరువాత దేశ అభివృద్ధి కి తోడ్పడుతుందని ఆశిద్దాం.