India Languages, asked by lalithakshaya2009, 6 months ago

desh bhakti essay on telugu please?

Answers

Answered by neerchaudhary9
14

Explanation:

దేశభక్తి, జాతీయత అనే వాటిని గురించి ఇవాళ చర్చించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలలో ‘‘దేశభక్తి’’పై తర్జన భర్జనలు ఉండవు. ‘‘దేశమునందు భక్తి’’అని చెప్తాం. ఇక్కడ భక్తి అంటే ఆరాధనా భావం. పూజనీయమైన భావం. ‘‘మేరా భారత్ మహాన్ హై’’ అనడం! ‘‘సారె జహాసె అచ్చా’’అని ప్రకటించడం. కానీ ఇవాళ దేశభక్తికి వికృత, విపరీత వ్యాఖ్యానాలు చేయడం మన దౌర్భా గ్యం! ఒక విధంగా పరిపాలకుల వైఫల్యం!

దేశభక్తి అనేది నిరంతర ప్రక్రియ. జీవనది లాంటిది. కానీ జాతీయోద్యమం తర్వాత మనలో దేశభక్తి చచ్చుపడిపోయింది. ఏ చైనావాడో, పాకిస్తాన్‌వాడో యుద్ధానికి వస్తే ‘‘కొంత’’ దేశభక్తి మేలుకొంటుంది. ఇంతకీ దేశభక్తి అంటే....?

ఒక జాతియొక్క ఆత్మగౌరవానికి, ఔన్నత్యానికి అనుకూలంగా ఉండటం. భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం.

‘‘అంతా ఒక్కటే- మనమంతా ఒక్కటే

రేకులు వేరైనగాని- పూవు ఒక్కటే’’

అని చెప్పడం. తను పుట్టిన నేలను, సంప్రదాయాలను, చారిత్రకతను అభిమానించడం. తన మతాన్ని అనుసరిస్తూనే దేశభక్తిని కలిగి వుండటమే జాతీయత లేదా దేశభక్తి.

తస్లిమా నస్రీన్‌పై ఫత్వా జారీచేయటం భావస్వేచ్ఛకి ద్రోహమని ఏ ప్రగతిశీలవాదీ అనలేదు. ఒక మతస్థులకి ఆరాధ్య దైవమైన గోవును చంపుతుంటే వీరెవరూ కిమ్మనలేదు. హిందూ ‘‘సోదరుల’’ మనోభావాలు దెబ్బతిన్నా స్పందించక పోవటం ‘‘దేశభక్తి’’అవుతుందా? ఎక్కడ ఉగ్రవాది బయటపడినా ముస్లిము మాత్రమే ఎందుకుంటాడో ‘‘దేశభక్తులు’’ అనబడేవారు మాట్లాడరు. వాడిగా వేడిగా మాట్లాడేవారు ఇక్కడ నిశ్శబ్దంగా ఉండటం వెనుక ‘‘ఓట్ల కుట్ర’’ఉంది. చివరికి ఈ దేశంలో ప్రగతిశీలత్వం అంటే ముస్లిములకి, దళితులకి అన్యాయం జరిగినప్పుడు పోరాడటం- అనే వ్యుత్పత్తి అర్థం వచ్చేసింది. మిగిలినవాళ్ళు ఎలా చచ్చినా మాకనవసరం- ఇదీ నేటి కుహనా ప్రగతిశీల వాదం!

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ మరణం బాధాకరం. మంచి భవిష్యత్తుగల యువకుడు మరణించటం విషాదం కూడా. అయితే అతని చావును అడ్డుపెట్టుకొని కుహనా మేధావులు, ఓట్ల పార్టీలు గొప్ప తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇవ్వడమే ఎంత అనుచితమో అంత దేశభక్తి విద్రోహం! దళితుల (బి.సి. అన్నారనుకోండి) ప్రాణాలే విలువైనవా? మనిషి ప్రాణం విలువైనదా? ఇతర కులస్థులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారు? కార్పొరేట్ విద్యాసంస్థల దాష్టీకంతో అమ్మాయిలూ అబ్బాయిలూ బలైపోతుండటం చూడలేని కబోదిలా వీళ్ళు? ఎన్.గోపి అన్నట్టు.

‘‘ముందుగా మనం మనుషులం’’!

దీనిని మర్చిపోతే ఎలా? ఎంతమంది ‘‘నిర్భయ’’లు అంతమయ్యారు? నిన్నకాకమొన్న ఒక టీ.వి. నటి ఆత్మహత్య చేసుకొంది. కట్నంకోసం బాధపడి పెళ్ళికూతురు మరణాన్ని ఆహ్వానించింది. ప్రేమించిన అమ్మాయిని చంపిన వాళ్ళు, యాసిడ్ పోసిన వాళ్ళు, అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నవాళ్ళు.... వీళ్ళంతా మనుషులు కారా? వీళ్ళ గురించి పట్టించుకోరే? నాగప్పగారి సుందర్రాజు అనే మంచి దళిత కవి ప్రేమ విఫలమై చనిపోయినప్పుడు ఈ పోరాట నాయకులు ఎక్కడ దాక్కొన్నారు? బిహార్ విశ్వవిద్యాలయాల్లో దారుణాలు జరుగుతున్నాయి- మరి వాటిని పట్టిం ‘‘మాకు మార్కులు వేస్తారా? వెయ్యరా?’’ అని జులుంతో ఆచార్యుల్ని బెదిరించి మార్కులు బలవంతంగా వేసుకొన్న సంఘటనలున్నాయి? అప్పుడు ఈ నిరసన గళాలు కిమ్మనలేదే?

విశ్వవిద్యాలయాలలో ఇవాళ ఒక వర్గం వారిదే పెత్తనం. వాళ్ళు ఆడించినట్టు ఆడితే వీ.సి. పదవి వుంటుంది. లేదంటే ధర్నాలు, రాస్తారోకోలు... ఏమైనా చేయగలరు? ఇదంతా దేశభక్తి అవుతుందా? అనేదే సూటి ప్రశ్న?

ఏ కులం వాడైనా, ఏ మతస్థుడైనా అన్యాయంతో బాధపడితే అతనికి అండగా నిలబడటం మానవత్వం, దేశభక్తి అవుతుంది. ‘‘మా కులం వాడికి అన్యాయం జరిగితేనే పిడికిలి బిగిస్తాం’’అనటం స్వార్థం అవుతుంది. కుళ్ళు అవుతుంది. నిజానికి ఇవాళ రిజర్వేషన్లు పొందుతున్న వారికంటె హీనంగా ఉన్న కులాలున్నాయి. వాళ్ళని వీళ్ళు అణగదొక్కేస్తున్నారు. నిజానికి అంబేద్కర్ గొప్ప మేధావి. ముందుచూపు ఉన్నవాడు. అందుకే ‘‘రిజర్వేషన్లు ఎల్లవేళలా మూడో కర్రగా ఉండకూడదు’’ అన్నాడు, అది దేశభక్తికి మచ్చు తునక.

కార్ల్‌మార్క్స్, లెనిన్, మావో వంటి వారిని ప్రశంసించడం సబబే. వీళ్ళు సమాజ శ్రేయస్సు గురించే ఆలోచించిన తత్త్వవేత్తలు. వీళ్ళని మాత్రమే స్తుతించి జయంతి ఉత్సవాలు చేస్తే అది అసంపూర్ణ దేశభక్తి అవుతుంది. ఈ దేశం తత్త్వవేత్తలకూ, మేధావులకూ గొడ్డుపోలేదు. శంకరాచార్య, వివేకానంద, అరవిందులు, సర్వేపల్లి రాధాకృష్ణ, శివానందమూర్తి వంటి వారిని కూడా స్మరించుకుంటే సంపూర్ణ దేశభక్తుడివి అవుతావు. వారి సందేశాలలో నీకు నచ్చనివి ఉన్నా గౌరవించటం దేశభక్తి. ప్రపంచ దేశాలు గాంధీని గౌరవిస్తుంటే నువ్వు ఉదాసీనం వహించి ‘‘మేమూ దేశభక్తులమే’’ అంటే నమ్మం.

‘‘లేదురా ఇటువంటి భూదేవి ఇంకెందు

లేరురా నీవంటి పౌరులింకెందు

అవమానమేలరా, అనుమానమేలరా

భారతీయుడనంచు భక్తితో పలుక’’

అన్న రాయప్రోలు మాటల్ని స్మరిస్తే దేశభక్తి అవుతుంది. ఈ దేశంలో పుట్టడం ఒక యోగం. ఈ నేలపై నడవటం ఒక భాగ్యం! ఈ దేశంలో పుట్టాను కాబట్టే నాకింత గుర్తింపు, పేరువచ్చింది- అనుకొన్నవాడు దేశభక్తుడవుతాడు. ‘‘ఈ దేశం గబ్బుకంపు కొడుతోంది. ఇదొక రోగగ్రస్త దేశం. ఇక్కడిది కుష్ఠు వ్యవస్థ’’అనడం దేశద్రోహం అవుతుంది. అతగాడిని దేశభక్తిహీనుడు అనవల్సిందే.

అమెరికాలో చాలామంది మీరెవరు? అంటే ‘‘అమెరికన్’’ అంటారు, అదీ దేశభక్తి! మన దేశంలో నేను తమిళుడ్ని- నేను కన్నడిగున్ని- నేను తెలుగువాడ్ని- నేను బెంగాలీ....’’ అంటాడు తప్ప ‘‘్భరతీయుడ్ని’’ అనరని ఒక విదేశీ బృందంవారి పరిశీలన! ఇది మనకి ఎంత తలవంపు??

అమ్మకి నమస్కారం

మదర్, మాతా, అమ్మ, మాఁవంటి పదాలు పవిత్రమైనవి. పూజనీయమైనవి. అమ్మలేకపోతే మనం లేము. మగవాడి వల్లనే పిల్లలు పుట్టరు. అతని బీజం స్ర్తిలో పడినప్పుడే మనమంతా పుడతాం. అమ్మ-స్ర్తిలు- లేకపోతే ఈ సృష్టి లేనేలేదు. పురుషులవల్ల మాత్రమే సృష్టి జరగదు- స్ర్తి క్షేత్రం వుంటే తప్ప! లేకపోతే పురుషుడు ‘‘నిర్వీర్యుడవుతాడు.’’ అందుకే ‘‘లక్ష్మీమాతాకీ జై’’, ‘‘మేరీమాత’’, ‘‘పోలేరమ్మ తల్లి’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తాం. ‘‘అమ్మలేనిదే నువ్వు జీరో’’ అంటోంది వైద్యశాస్త్రం. అటువంటి దేశమాతకి ‘‘జై’’అనకపోవడం అంటే మాతృ ద్రోహమే! అమ్మ పాలు త్రాగి రొమ్ము గ్రుద్దడమే

Answered by vanishkakumari
5

Explanation:

telugu :-

దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి, జాతీయతా భావం ఒకటే. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.

English:-

Patriotic people have a passion for the country of their birth (motherland or fatherland). It can be an area or even a town or a village. Such patriots are proud of the progress, traditions, etc. that their country has achieved. The sense of patriotism and nationalism is the same. In patriotism, the country is more important than the individual. This is especially evident in the national defense system. They are proud to sacrifice even their lives...

pls mark it as brainliest

Similar questions