History, asked by archinichi, 11 months ago

difference between a village and city in telug

Answers

Answered by Anonymous
1

Answer:-

మన పట్టణాలకి , పల్లెలకి  ఎంతో తేడా ఉంది.  మనుషుల స్వభావాలు, వారి ప్రవర్తనలు, అమాయకత్వం, వారు చేసే పనులు, వారి దినచర్యలు, ప్రేమలు అనుబంధాలు, ద్వేషాలు ఈ అన్నింటిలోనూ పట్టణ వాసులకి , పల్లెటూరి ప్రజలకి చాలా తేడా ఉంది.

 


   నివసించే ప్రాంతం, వాతావరణం, సౌలభ్యం, రవాణా సౌకర్యాలు, విద్య నేర్చుకొనే బడులు, కళాశాలలు వారిలోని ఉపాధ్యాయుల శక్తి

సామార్ద్యాలు ఇలా ఎన్నో విషయాల్లో పల్లెటూరు నగరాలకన్నా వెనుకబడి ఉన్నాయి.  వాతావరణ కాలుష్యం మాత్రం భగవంతుని దయ వల్ల ఊరిలో

ఇంకా తక్కువే ఫాక్టరీ కి దగ్గరగా ఉంటే మాత్రం దుర్భరం.  అనుబంధం ఆత్మీయత ల విషయానికొస్తే ఊరి ప్రజలు ఆప్యాయంగా

పలుకరిస్తారు.  ఇంకా మన పల్లెటూళ్లలో కంప్యూటర్

, ఇంటర్నెట్, సౌకర్యాలు పూర్తి గా లేవు. ఇపుడే వస్తున్నాయి.




   చాలామంది  పల్లె ప్రాంతానికి  పోడానికి ఇష్టపడరు.  వినోద కార్యక్రమాలు, చూడడానికి వింతలు, అనేక రాజకీయాలు , సమావేశాలు, సభలు, కవిత్వ సాహిత్య సమ్మేళనాలు నగరాలలోనే

 ఎక్కువ. 

ఉద్యోగ అవకాశాలు కూడా నగరాలలోనే ఎక్కువ. 

ఇంకా కొన్ని పల్లెటూళ్లలో అయితే మరుగుదొడ్లు కూడా లేవు. పాఠశాలల్లో అన్నిసౌకర్యాలు

ఉన్నట్టులేవు. 


   పల్లెటూరు మన భాగ్యసీమ అన్నారు కానీ  నగరాలు

మాత్రమే భాగ్యసీమలు ఇప్పటి ప్రపంచంలో. 



Similar questions