India Languages, asked by sriramulukolimi, 9 months ago

e any
ఏదేని మూడు పర్యావరణ చట్టాల గూర్చి తెలియచేయుము​

Answers

Answered by sadieshaik
6

Answer:

MARK AS BRAINLIST

Explanation:

భూమి, సహజ వనరుల హక్కు సంరక్షణ చట్టం (1972): స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో పర్యావరణంపై జరిగిన యూఎన్‌ఓ సదస్సులో భూమి, సహజ వనరులను రక్షించేందుకు ప్రతి దేశం చర్యలు తీసుకోవాలనినిర్ణయించారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (1974): నీటి కాలుష్య నివారణ చట్టం ప్రకారం 1974 లో కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు. 1981లో చేసిన వాయు కాలుష్య నివారణ చట్టంలోని అధికారాలను కూడా ఈ సంస్థకే అప్పగించారు.

అడవుల సంరక్షణ చట్టం (1980): ఈ చట్టం ప్రకారం ఏ రాష్ర్టమైనా కేంద్రం అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదు. అటవీ భూముల్లో ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడితే ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందాలి.

అటవీ, పర్యావరణ శాఖ (1985): కేంద్ర ప్రభుత్వం 1985లో పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. పర్యావరణం, అడవులకు సంబంధించి కార్యక్రమాల

అమలుకు అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ఎకోమార్క్‌ (1991): దీన్ని భారత ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌్స) జారీ చేస్తుంది. 1991లో దీన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకోమార్క్‌ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. పర్యావరణంపై ప్రభావం చూపే ఉత్పత్తులను అంగీకరించదు.

Similar questions