eassy on apjabdul kalam in telugu
peddipratyusha:
send fast
Answers
Answered by
1
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త మరియు 11 వభారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998 లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్ధిగా ప్రతిపాదించబడగా , ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
Similar questions
Physics,
9 months ago
India Languages,
9 months ago
World Languages,
1 year ago
Environmental Sciences,
1 year ago
Hindi,
1 year ago