Eassy on vathavarana kalushuyam in telugu
Answers
Answer:
పెరుగుతున్న కాలుష్యంతో ప్రజా పర్యావరణానికి పెను ప్రమాదం పొంచిఉంది. భూమి ఉష్ణోగ్రతలు నానాటకి పెరుగు తుండడంతో ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తునే ఉన్నారు. అడ్డూ అదుపు లేకుండా అడవుల నరికివేత, పెరుగుతున్న నగరీకరణ, జనాభా పెరుగుదల, భూసారం, జలవనరులపై కనబడే దుష్ఫ్రభావం నానాటికి భూగోళంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవు తున్నాయి.
అంతరించి పోతున్న అడవులు, కరిగిపోని వ్యర్థాలతో కాలుష్యం పెరుగుతోంది. దీంతో పర్యావరణానికి ప్రమాదముందని ఖగోళ శ్రాస్తజ్ఞులు గతంలో హెచ్చరించారు. నీటి, జల, వాతావరణ, చెత్తకాలుష్యం విపరీతంగా రసాయనిక ఎరువుల వాడకంతో భూఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవుల సంపదను విస్తరించాల్సి ఉంది. ఉన్న అడవులను నరికివేస్తున్నారు. మానవుల స్వార్థంతో అడవులు అంతరించిపోతున్నాయి. దీంతో జంతులు కూడా అంతరిస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు వాహనాలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకు తోడు కొన్ని ఆటోలకు కిరోసిన్ వాడుతున్నారు. వీటి నుంచి వెలువడే పొగతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం టన్నుల కొద్ది ప్లాస్టిక్ కవర్లను భూమలో వదిలి వేస్తున్నారు. అవి మట్టిలో కరిగి పోవడంలేదు. దీనిని నిషేధించాలని ప్రపంచ దేశాల సంస్థల్లో పలుమార్లు నిర్ణయం తీసుకున్నా, అది ఎక్కడా అమలు కాలేదు. దినసరి మార్కెట్, కిరాణాకొట్టు, టీకొట్టు, హోటళ్లు, బెకరీల్లో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వాడుతున్నారు. ప్లాస్టిక్ గ్లాస్‌కు వేడి తగిలితే కొన్ని వింత రసాయనాలు వెలువడి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ప్రజల్లో చైతన్యం వస్తే తప్పా పర్యావరణ సమతుల్యం సాధించడం కష్టమని పలువురు మేధావులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.