Biology, asked by revallikrishna809935, 5 months ago

Environment essay in telugu

Answers

Answered by kavyaveda
2

Explanation:

ప్రతీ ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం దగ్గరకు రాగానే హరిత చట్టాలు మరింత కఠినింగా ఉండాలనే వాదనలు అంతటా వినిపిస్తూ ఉంటాయి. చట్టాలు ముఖ్యమే, అయతే పర్యావరణాన్ని పరరక్షించటానికి చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది.

ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరగాయి. చెట్లు, నదులు, పర్వతాలు, ప్రకృతి వీటన్నింటిని ఎల్లప్పుడూ పూజించారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. అన్ని ముఖ్యమైన పండుగలు, సంప్రదాయాలలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. నదులను తల్లులుగా, భూమని దేవతగా కొలిచిన దేశం మనది. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది. వినూత్న విధానాలలో నీటిని పొదుపు చేయడం, రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయడం మొదలైనవి తెలియజెప్పాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, మొక్కలు పెంచడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన 27 నదుల పునరుజ్జీవ కార్యక్రమం సమాజంలోని అందరి భాగస్వామ్యంతో మాత్రమే మాత్రమే సాధ్యమైంది.

నిజం చెప్పాలంటే మనిషిలోని దురాశే కాలుష్యానికి మూల కారణం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశ పర్యావరణాన్ని ఛిద్రం చేస్తోంది. భౌతికింగా కాలుష్యాన్ని సృష్టించడమే కాక, వ్యతిరేక భావాలను సృష్టించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. మానవులలోని ఈ మనస్తత్వాన్ని, ఈ సమస్యకు మూల కారణాన్ని మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

Answered by ItzBeautyBabe
2

{\tt{\red{\underline{\underline{\huge{Answer:}}}}}}

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము(biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును.

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది. వాయు కాలుష్యం వలన స్ట్రాటో ఆవరణం(Stratospheric) లో ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యానికే కాక భూమియొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు

Similar questions