India Languages, asked by ltrintu4883, 10 months ago

Essay of birds in Telugu

Answers

Answered by soumjoshi273
2

Answer:

Answer

Explanation:

Mark on brainlist

పక్షులు (ఆంగ్లం Birds) రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. తెలుగు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు.

పక్షులు అంతరోష్ణ లేదా ఉష్ణ రక్త జీవులు.

ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.

శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.

వీటిలో ఒకే ఒక గ్రంథి (తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి) తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి.

పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం (Synsacrum) ఏర్పడుతుంది. ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం (Scapula) పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది.

కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు (Flight muscles) అంటారు.

Mark on brainlist

Similar questions