essay on article 370 in telugu
Answers
Answer:
ప్రధానాంశాలు:
ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.
ఇంతకూ ఆర్టికల్ 370 ఏం చెబుతోంది.
ఈ ఆర్టికల్ జమ్మూ కశ్మీర్‌కు ఎలాంటి అధికారాలను కల్పిస్తుంది?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
గత కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను కశ్మీర్లో మోహరించింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ నుంచి యాత్రికులు, పర్యాటకులను వెనక్కి పంపించేశారు. తాజాగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 గురించి ముఖ్య విషయాలు మీకోసం..
* జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. * ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
* ఈ ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు.
samayam-telugu
Article-370
* రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.
* ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు.