Essay on bathukamma in telugu
Answers
బతుకమ్మ పండగ అంటేనే పువ్వులు గుర్తు వస్తాయి.ఇది ఒక పూల పండగ.తెలంగాణ ప్రాతంలోని మహిళలు అందరు ఈ పండగ చాల శ్రద్ధగా చేసుకుంటారు.
ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం భాద్రపద మాసం అమావాస్య నాడు సాధారణంగా సెప్టెంబరు-అక్టోబరు లో జరుపుకుంటారు . బతుకమ్మ దుర్గా దేవి నవరాత్రి సమయంలో తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఇది మహాలయ అమావాస్య రోజున మొదలై 9 రోజుల జరుపుకుంటారు . ప్రముఖంగా ఇది దసరా ముందు రెండు రోజులు దుర్గాష్టమి అని పిలుస్తారు ఆశ్వయుజ అష్టమి న పెద్ద బతుకమ్మను చేసి గుడిలో పూజిస్తారు.
మొదటి ఐదు రోజుల్లో మహిళలు వారి వాకిళ్లు శుభ్రం చ్చేసుకుని , ఆవు పేడ కలిపిన నీరు పునాది బేస్ గా ప్రాంగణంలో కళ్లపు వేస్తారు , బియ్యం పిండితో ముగ్గుతో అలంకరిస్తారు. మొదటి ఐదు రోజులు బతుకమ్మను ఆవు పేడ తో తయారుచేస్తారు.
బంతి పువ్వులు చామంతులు ఇలా రకరకాల రంగుల పువ్వలతో బతుకమ్మను తాయారు చేసి వాటిని వరసలుగా పేర్చి ఎవరికి తోచి నట్టు గ వారు వాళ్లకున్న పువ్వులను బట్టి బతుకమ్మ తారు చేస్తారు.రక రకాల రంగులతోబతుకమ్మ ఎంతో అందంగా ఉంటుంది.శంఖము ఆకారంలో ఆయా పువ్వులు అన్ని పేర్చుతారు..
ఆ శంఖం రూపం లో ఆయా పువ్వులన్ని ఒక పళ్లెంలో అమర్చి మద్యలో రకరకాల ఆకులతో ఆయా పువ్వులు పడిపోకుండా బతుకమ్మను అమరుస్తారు.ఎంత పెద్దదిగా అమర్చితే అంత పెద్ద బతుకమ్మ తయారవుతుంది.ఆఖరిలో బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరీ దేవి ని తాయారు చేసి ఆ బతుకమ్మ మీద పెడతారు.
సాయంకాలం ఆడువారు అందరు ఆభరణాలు ధరించి కొత్త బట్టలు కట్టుకుని ఎవరి బతుకమ్మ వారి చేతిలో పెట్టుకుని ఒక చోట కూడి అందరు అక్కడ కు చేరి బతుకమ్మ ల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలా బంగారు బతుకమ్మ ఉయ్యాలా అని రక రకాల పాటలు పడుతూ చివరిన ఎవరి బతుకమ్మ వాళ్ళని గంగలో కానీ చెరువులో కానీ సముద్రం లో కానీ వదిలేస్తారు.
Explanation:
ఆశ్వయుజ మాసంలో తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగను వేడుకగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత వుంది. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం వుందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం వుంది. అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ.
వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా వుంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా వుంటుంది. చెరువులన్నీ తాజా నీటితో నిండి వుంటాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో గునుక, తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. అలాగే సీతాఫలాలు కూడా విరగకాస్తాయి. మొక్కజొన్న పంట కూడా కోతకు సిద్ధమై వుంటుంది. ప్రకృతి రమణీయతతోపాటు రైతులకు కూడా సంతృప్తికరంగా వుండే వాతావరణం తెలంగాణ అంతటా వుంటుంది. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.
బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్ళలో హడావిడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి ప్రతిరోజూ సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. నయన మనోహరకరంగా వుంటుంది ఆ సన్నివేశం. ఆ రోజున పురుషులంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగ, కలువ పూలను కోసుకుని వస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగ, తంగేడు, కలువ పువ్వుల్ని, మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు వున్నా గునుగ పూలు, తంగేడు పూలదే ఆధిపత్యం వుంటుంది.
గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా వుండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు. ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా వుంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మని బయటకి తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు.